Breaking News

Daily Archives: October 1, 2019

గ్రామాల్లో తనిఖీ బందాలు ఎప్పుడైనా రావచ్చు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పనులను తనిఖీ చేయడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు ఎప్పుడైనా రావచ్చని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి డివిజన్‌ స్థాయి అధికారులతో మాట్లాడారు. 30 రోజుల ప్రణాళిక మరో నాలుగు రోజుల్లో పూర్తవుతున్నందున మిగిలి ఉన్న పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపినట్లుగా పనులను పరిశీలించడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు ...

Read More »

5లోపు జీతాలివ్వాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్‌ యూనియన్‌ (ఏఐటియుసి) అను బంధ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్‌, దోమకొండ ఆసుపత్రుల కార్మికులకు గత 2 నెలల నుండి జీతాలు అందక ...

Read More »

ఆర్‌కె సంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌కె గ్రూప్‌ ఆఫ్‌ ఇన్స్టిట్యూషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌, ఎస్‌.పి. శ్వేతా రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ధపెదార్‌ శోభ రాజు బతుకమ్మ సంబరాల ఇంచార్జి అంబిర్‌ మనోహర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More »

తూతూమంత్రంగా మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం మండల పరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజినీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. ప్రధాన శాఖల అంశాలను పరిగణనలోకి తీసుకుని మిగతా శాఖలను కొనసాగించకుండానే సమావేశం ముగించారు. వ్యవసాయ శాఖ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్‌, రెవెన్యూ శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే అధికారులు కార్యాలయాలకే పరిమితమవ్వడంతో గ్రామాల్లో పాలన కుంటుపడుతుందని సభ్యులు అదికారులను ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 1 కోటి 2 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

రెంజల్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూల రంగులతో బతుకమ్మను పేర్చి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో దాండియా ఆడారు. అంగన్‌వాడి టీచర్లు, ఎంపీపీ రజినీ, జడ్పీటీసీ విజయ, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల, పంచాయతీ రాజ్‌ ఏఈ లిఖిత తీరొక్క పూలతో బతుకమ్మలను చేర్చి ఒకచోట ఉంచి బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ...

Read More »

అమ్మవారికి చీరల సమర్పణ

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజేపీ రాష్ట్ర కార్తవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆద్వర్యంలో దుర్గామాత మంటపాల వద్ద అమ్మవారికి చీరలను అందజేశారు. కామారెడ్డి పట్టణంతో పాటు ఆయా గ్రామల్లో సైతం పార్టీ ఆధ్వర్యంలో అమ్మవారికి చీరలను అందచేసినట్లు తెలిపారు. దుర్గామాత మంటపాల నిర్వాహకులకు వీటిని అందించి అమ్మవారికి అలంకరించమని కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

కూరగాయల విత్తనాలు పంపిణీ

బీర్కూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల పరిధిలోని అంకోల్‌ క్యాంపులో మంగళవారం మహిళలు రైతులతో కలిసి వ్యవసాయ అధికారులు ఆహార భద్రత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలకు జాతీయ ఆహర భద్రతపై అవగాహన కల్పించారు. ఉచితంగా కూరగాయలు విత్తనాలను ఎరువులను 25 మంది మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నసురుల్లాబాద్‌ ఎంపిపి పాల్త్యా విఠల్‌, ఉపాద్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి, బాన్సువాడ డివిజన్‌ వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌. ఏఇవో నరేంద్ర, రైతులు, మహిళలు, గ్రామస్తులు ...

Read More »

కుల రహిత సమాజానికై అడుగులు వేద్దాం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ఐఎఫ్‌టియు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కోరారు. సోమవారం రాత్రి మామిడిపల్లిలో జరిగిన కులనిర్మూలన చైతన్య సదస్సులో దాసు పాల్గొని ప్రసంగించారు. జ్యోతిబా పూలే సత్యశోధక సంస్థ 147వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనమంతా దేశంలో కుల సమస్యతో ఎందుకు ఇంక బాధపడుతున్నామనే విషయాన్ని తెలుసుకోవలసిన అవసరముందన్నారు. కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ బ్రాహ్మణ భావజాలంతో పరిపాలన కొనసాగించడం ...

Read More »

ట్రీ గార్డులకు సపోర్టు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల రక్షణకు ఏర్పాటు చేసే ట్రీ గార్డులు పడిపోకుండా వాటికి సపోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారని అయితే అవి గాలికి పడిపోకుండా కట్టెలతో సపోర్టు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ఆయన ముబారక్‌నగర్‌ ప్రాంతంలో పర్యటించి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను ...

Read More »

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాలను 2వ తేదీన గ్రామాలలో, 4న మున్సిపాలిటీలలో, 6న జిల్లా కేంద్రంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినందున మహిళలకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మలు ఆడే చోట లైటింగ్‌, నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్‌తో పాటు గజ ...

Read More »

మహాత్ముని మార్గంలో మనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ”మహాత్ముని మార్గంలో మనం” కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌ గ్రామంలో 1.5 కిలోమీటర్ల శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని భీంగల్‌ సిఐ సైదయ్య జెండా ఊపి ప్రారంభించారు. భారతమాత విగ్రహం నుండి ర్యాలీ గా బయలుదేరి గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా సిఐ సైదయ్య మాట్లాడుతూ యువత ...

Read More »

వారసత్వ కళలు కాపాడుదాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ వారసత్వ కళలను నేర్పించే సంకల్పంలో భాగంగా శ్రీ విపంచి సంస్కతి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పెయింటింగ్‌ శిక్షణ ఇస్తున్నట్టు తిరునగరి గిరిజా గాయత్రీ తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌ శంకర్‌భవన్‌ పాఠశాలలో మంగళవారం వర్లీ, కలంకారీ, మధుబని, గ్లాసు పెయింటింగులందు శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మామిడాల లలిత, లక్ష్మీ సాయన్న, దాసు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

పెద్దలను ఆదరించడం అందరి బాధ్యత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయసు మీద పడి ఒకరి పైన ఆధారపడిన పెద్దలను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అది ధర్మం కూడా అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. వయోవద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ – ఆర్‌బివిఆర్‌ఆర్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ముబారక్‌ నగర్‌ ఆలంబన ఆశ్రమంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తల్లిదండ్రులు ...

Read More »