Breaking News

Daily Archives: October 2, 2019

ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, నిజామాబాద్‌ జిల్లా ఇరిగేషన్‌ పనులపై అధికారులతో సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు. నిజామాబాద్‌ జిల్లా పెండింగ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై, ఆన్‌ గోయింగ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఎర్రమంజిల్‌ ఆర్‌అండ్‌బి ఆఫీస్‌ లో సంబంధిత ఇరిగేషన్‌ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, ఈఎన్సీ ...

Read More »

అంతరిక్ష ప్రదర్శన సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ స్పేస్‌ వీక్‌ సందర్భంగా ఈ నెల నాలుగు నుండి ఆరవ తేదీ వరకు స్థానిక నిర్మల హదయ పాఠశాలలో స్పేస్‌ వీక్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలతో అంతరిక్ష ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ప్రజాసైన్స్‌ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గన్‌పూర్‌ వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు కస్తూరి గంగా కిషన్‌ ప్రధాన కార్యదర్శి సుశీల్‌ కుమార్‌ ఉపాధ్యక్షులు రాంచందర్‌ గైక్వాడ్‌ గణిత ఫోరం ప్రధాన కార్యదర్శి కాంతారావులు తెలిపారు. తెలంగాణ ...

Read More »

కలిసి కట్టుగా పని చేయాలి

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనూర్‌ మండలంలో బుధవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు భూపాల్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అందరూ కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ అభియాన్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ – మోహన్‌ రెడ్డి, మండల పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

రెంజల్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందించిన బతుకమ్మ చీరలను బుధవారం అంబేద్కర్‌ నగర్‌లో సర్పంచ్‌ మతురాబాయి, తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీవో గోపాలక ష్ణ మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కషి చేశారని, ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ కానుకగా ప్రతి ఏడాది చీరలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి గౌస్‌, డిప్యూటీ ...

Read More »

జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు

రెంజల్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో గురువారం తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాగతి మండల అధ్యక్షుడు నీరడి రమేష్‌ తెలిపారు. బతుకమ్మ పోటీల్లో పాల్గొని గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.

Read More »

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి గ్రామంలోని పాఠశాలలో గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వర్గీయ మగ్గిడి చెంప భాయి, గంగాధర్‌ రావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన భోజన శాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి, ఆశన్నగారి రాజేశ్వర్‌ రెడ్డి, స్వర్గీయ మగ్గిడి గంగాధర రావు కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

స్వచ్చతాహి సేవా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్లాస్టిక్‌ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతహి సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ నిర్మూలనకు మహిళల కషి సహకారం అవసరమని, స్వచ్ఛ నిజామాబాద్‌లో భాగంగా ప్లాస్టిక్‌ లేని నగరంగా చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్‌ జాన్‌ సాంసంన్‌, మెప్మా పిడి రాములు, ...

Read More »

తులసీ ట్రస్టు ఆధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షన్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం తులసి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాగారం లోని శ్రీనివాస సిద్ధార్థ నగర్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి జిపిఎస్‌ జెండాగల్లి ప్రధానోపాధ్యాయుడు రాంచందర్‌ గైక్వాడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రధాన వీధుల గుండా విద్యార్థులు ...

Read More »

ఆదర్శం కామారెడ్డి ఆర్యవైశ్య యువజన సంఘం

కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ 150 వ జయంతి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వీటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో 20 మంది సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు గుప్తా, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు యాద నాగేశ్వర్‌ గుప్తా మాట్లాడారు. కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్రంలోని ఆర్యవైశ్య యువజన ...

Read More »

మహాత్ముడి ఆశయసాధనకు కషిచేయాలి

రెంజల్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్ముని బాటలో ప్రయాణించి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు చేయాలని సర్పంచ్‌ సునీత అన్నారు. మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా మండలంలోని మౌలాలి తండాలో సర్పంచ్‌ సునీత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముడు చూపిన బాటలోనే ప్రతి ఒక్కరు ప్రయాణించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటం వద్ద తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని పల్లె ప్రగతికి కషి చేస్తామని పాలకవర్గం ...

Read More »

30 రోజుల ప్రణాళిక ఆరంభం మాత్రమే

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల ప్రవేశం వద్ద చెత్తకుప్పలతో లేకుండా పచ్చదనంతో ఆహ్వానం పలకాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా డిచ్‌పల్లి మండలంలోని నడికుడలో స్వచ్ఛ సంరక్షణ గ్రామీన్‌ కార్యక్రమంలో భాగంగా స్వచ్చతాహి సేవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన మార్గంలో నడిచినప్పుడే ...

Read More »

లండన్‌లో గాంధీజయంతి – నివాళులర్పించిన స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్‌ లోని టావోస్టిక్‌ స్క్వేర్‌ పార్క్‌ లోని గాందీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బ్రిటన్‌ లోని ఇండియన్‌ హైకమీషన్‌ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్‌ హైకమీషనర్‌ రుచి ఘనశ్యాం, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. అధికారిక పర్యటనలో బాగంగా స్పీకర్‌ ...

Read More »

ఘనంగా గాంధీ జయంతి

బాన్సువాడ, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్‌లో మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో దేశాయిపెట్‌ సహకార సంఘ చైర్మన్‌ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆర్డీఓ రాజేశ్వర్‌, పురపాలక కమిషనర్‌ కుమారస్వామి, గ్రామ పెద్దలు బాపూజీకి నివాళులు అర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Read More »

పూజా మందిర నిర్మాణానికి భూమిపూజ

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ శక్తి పీఠాధిపతి మధు సుధానంద సరస్వతి స్వామి బుధవారం పూజా మందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. పుల్కల్‌ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సర్వేశ్వర్‌ మందిర్‌ ఆవరణలో గల స్థలంలో వేదపండితులు పూజ నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని అయ్యప్ప సేవా సమితికి పూజా మందిరం కోసం కేటాయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయలక్ష్మి భూమి శెట్టి, వైస్‌ ఎంపీపీ రాజు పటేల్‌, వార్డు సభ్యులు సంతోష్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ...

Read More »