Breaking News

వాడవాడలా ఘనంగా బతుకమ్మ వేడుకలు

రెంజల్‌, అక్టోబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి, దూపల్లి, రెంజల్‌, దండిగుట్ట గ్రామాల్లో గురువారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తీరొక్క పూల రంగులతో బతుకమ్మను పేర్చి గ్రామ కూడళ్లలో ఒకచోట చేర్చి బతుకమ్మ ఆటపాటలతో దాండియా ఆడారు. డిజె పాటలతో యువతులు ప్రత్యేక న త్యాలు చేశారు.

బతుకమ్మలను గ్రామ శివారులోని చెరువులో నిమర్జనం చేశారు. రెంజల్‌ మండల కేంద్రంలో తెలంగాణ జాగతి మండల అధ్యక్షుడు నీరడి రమేష్‌ ఆద్వర్యంలో బతుకమ్మ వేడుకలకు నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులను ప్రదానం చేశారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *