Breaking News

రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక వర్గంలోని పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సుధాకర్‌ రావ్‌, పిట్లం మార్కెట్‌ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బిచ్కుంద మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సంది సాయవ్వ సాయిరాం, వైస్‌ ఛైర్మన్‌గా పెద్ద దేవడాకు చెందిన సీనియర్‌ నేత మలికార్జున్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

పిట్లం రాజేశ్వరి ఫంక్షన్‌ హల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసన సభ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్యెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లాల జడ్పి చైర్మన్లు దాదాన్నగిరి విట్ఠల్‌, శోభ ధపెదార్‌ రాజు, ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ గంగాధర్‌ పట్వారీ ముఖ్య అతిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలతో ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మాట్లాడుతూ మార్కెట్‌ కమిటీ ద్వారా వ్యవసాయ రైతులకు పెద్ద పీట వేసి వారి సంక్షేమాకి పాటుపడటం జరుగుతుందని తెలిపారు. నూతన చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన పాలక వర్గం మార్కెట్‌ కమిటీ ద్వారా వ్యవసాయ రైతులకు అన్ని రకాలుగా సహకారం అందించి వారికి లబ్ధిచేకూర్చడం జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరుకుంటుందని ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే తెలిపారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్‌ యార్డ్‌ ద్వారా ప్రభుత్వ కొనుగులుతో గిట్టుబాటు ధర కల్పించి రైతులను మహరాజులను చేయడం జరుగుతుందన్నారు. ఉదాహరణకు రైతులు పండించిన పంట పెసర ప్రభుత్వం 7,050 ఏడు వేల యాభై రూపాయలకు కొనుగోలు చేయడం జరుగుతుందని, వ్యాపారస్తులు పెసర పంట 5 ఐదు వేల నుండి 6 వేల లోపు ధరతో తీసుకోవడం జరుగుతుందని వివరించారు.

వ్యవసాయ రైతులు అన్ని రంగాలలో అభివద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దష్టి వహించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు. రైతులు పంటలు పండించుకోవడాని సబ్సిడీ ద్వారా విత్తనాలు, ఆర్థిక సహాయంలో భాగంగా రైతు బంధు ద్వారా ఎకరానికి ఒక పంటకు ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు.

కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల జడ్పి ఛైర్మన్లు నూతన పాలకవర్గ సభ్యులను పూలమాల, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు, డైరెక్టర్లు, తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *