Breaking News

Daily Archives: October 4, 2019

కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ఆర్‌టిసి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, కామారెడ్డి డిపో వారు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ నాయకత్వంలో వారు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సామాన్య ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పక్షాన కోరుతున్నామన్నారు. కార్మికుల డిమాండ్ల మెమోరాండాన్ని డీసీసీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌కు అందజేయడం జరిగింది.

Read More »

చెక్కు పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, మాచారెడ్డి మండలాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు సుమారు 10 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Read More »

దుర్గామాతకు కుంకుమార్చనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచ్‌రాస్తాలో శివసేన దుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత మండపం వద్ద శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాకుండా అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. భక్తులకు అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతినిధులు జేపీ సచిన్‌ మాట్లాడుతూ శివసేన దుర్గా ...

Read More »

పిట్లంలో అట్ల బతుకమ్మ వేడుకలు

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక వర్గంలోని పిట్లం మండలంలో తెలంగాణ జాగతి కన్వీనర్‌ అనిత సింగ్‌ ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే తనయుడు హరీష్‌ షిండే పాల్గొని బతుకమ్మ ఆడి అందరిని ఆకట్టుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆట పాటలతో వేడుకలు నిర్వహించారు. హరీష్‌ షిండే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ ఒక భాగమని, సంప్రదాయబద్దంగా, భక్తి, శ్రద్దలతో బతుకమ్మ వేడుకలు ...

Read More »

మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయములో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మున్సిపల్‌ ఇంచార్జి శైలజ, బతుకమ్మ పోగ్రామ్‌ ఇంచార్జి అంబిర్‌ మనోహర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More »

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర టీయూ డబ్ల్యూజె కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు లతీఫ్‌ ఆదేశానుసారం కౌన్సిల్‌ మెంబర్‌ సంగాయప్ప ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్‌కు డివిజన్‌ స్థాయి విలేకర్లు వినతి పత్రం అందించారు. రాష్ట్ర జర్నలిస్టుల సంఘం తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (ఐజెయు) ఆదేశానుసారం రాష్ట్రంలోని అన్ని డివిజన్‌ స్థాయిలో శుక్రవారం ఆర్డీఓలకు జర్నలిస్టులు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు ముఖ్య మంత్రి కేసీఆర్‌ దష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా సహకారం ...

Read More »

ఆటో, ఆర్టీసి బస్సు ఢీ – ఇద్దరు మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఉగ్రవాయి స్టేజి వద్ద కరీంనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామరెడ్డి వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘనపూర్‌కు చెందిన భూక్య రవి (40), పాల్వంచకు చెందిన రజియా (35) అక్కడికక్కడే మతి చెందారు. కరీంనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి కరీంనగర్‌ వెళ్తుండగా ఉగ్రవాయి స్టేజి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోడ్రైవర్‌ బుక్యా రవి, ఆటోలో ప్రయాణిస్తున్న పాల్వంచ చెందిన ...

Read More »

ఇచ్చిన హమీలు అమలు చేయాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, 239 జీ వో రద్దుచేసి జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని టియుడబ్ల్యుజె నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని జర్నలిస్టులు శుక్రవారం ఉదయం అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి టీయూడబ్ల్యూజే, ఐజేయూ డివిజన్‌ స్థాయి జర్నలిస్టుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అక్కడి నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు తమ సమస్యలు ...

Read More »

అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతరిక్షంలో జరిగే విషయాలు అందుకై నిర్వహించే పరిశోధనల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. స్థానిక నిర్మల హదయ విద్యాసంస్థలో వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ, వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ సందర్భంగా ప్రదర్శన నిజామాబాద్‌లో నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్షం పై అవగాహన కలిగి ఉండడం విద్యార్థులతోపాటు ప్రతి ఒక్కరికి అవసరమేనని అన్నారు. సైన్స్‌ ...

Read More »

విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల సందర్భంగా జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన కలెక్టర్‌ గ్రౌండ్‌లో నిర్వహించే ముగ్గుల పోటీలకు నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని జిల్లా సమాచార శాఖ ఉపసంచాలకులు మమ్మద్‌ ముర్తుజా తెలిపారు. పోటీల్లో పాల్గొని ప్రధమ ద్వితీయ, తతీయ బహుమతులు గెలుపొందిన వారికి 5000, 3000, 2000 రూపాయల చొప్పున నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని చెప్పారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ జ్ఞాపిక అందజేయడం జరుగుతుందని ...

Read More »

సీఎంసీ లో పర్యటించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవీఎంలు, వివి పాట్‌లు, వివి ప్యాట్‌ల రసీదులు భద్రపరిచిన సీఎంసి కళాశాలలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సందర్శించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గత ఎన్నికలలో పోలైన ఓట్లు గల వివి పాట్‌ల చీటీలను శ్రెడ్డింగ్‌ యంత్రాల ద్వారా చించి వేయడానికి నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. రెవెన్యూ ఇతర అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 5 నుండి సమ్మెలో పాల్గొనబోతున్నందున ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌ కలెక్టర్లను, అధికారులను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి డీజీపీ మహేందర్‌ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్లు, పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...

Read More »

జిల్లాస్థాయి కబడ్డి టోర్నమెంట్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10, 11 తేదీల్లో జిల్లాస్థాయి కబడ్డి టోర్నమెంట్‌ ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నమెంట్‌ నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం జాగిర్యాల్‌లో ఉంటుందన్నారు. ఎంట్రీ ఫీజు రూ. 600లుగా నిర్ణయించారు. కాగా విజేతలకు మొదటి బహుమతి 5 వేల నగదు, రెండవ బహుమతి 2500 నగదు, 3వ బహుమతి 1500 నగదు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ప్రశాంత్‌ సెల్‌ 8008846258, కె.ప్రశాంత్‌ సెల్‌ 9666244852, విలాస్‌ సెల్‌ 9703900511 ...

Read More »

పక్కదారి పడుతున్న గహావసర సిలిండర్‌

నందిపేట్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ‘డొమెస్టిక్‌’ గ్యాస్‌ సిలిండర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గహావసరాలకు వినియోగించే (డొమెస్టిక్‌) సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌లు యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. సిలిండర్ల వ్యాపారం ప్రధానంగా నిజామాబాద్‌ నగరంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌ లాంటి పట్టణాలు, నందిపేట్‌ లాంటి మండల కేంద్రాల్లో కూడా జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్‌లలో ఇంటి కొరకు వాడే ఎర్ర సిలిండర్‌లను దొంగచాటున హోటల్‌ వాళ్ళు సంచులు కప్పి ...

Read More »