నిజామాబాద్, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాసనసభ వ్యవహారాలు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడారు.
పచ్చదనం పరిశుభ్రతగా గ్రామాలు ఉండాలనే ఉద్దేశంతోనే 30 రోజుల ప్రణాళికలు రూపొందించినట్లు, ప్రణాళిక ద్వారా పల్లెల రూపురేఖలు మారే అవకాశముందన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలలో అధికారులను ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ప్రజల సహకారంతో పల్లె ప్రగతి చెందుతుందనే సంకల్పంతో శ్రీకారం చుట్టినట్లు మంత్రి అన్నారు.
అందరు కలిసి గ్రామాన్ని వీలైనంత తొందరగా అభివద్ధి చేసుకోవాలని సూచించారు. 30 రోజులు ప్రత్యేక ప్రణాళికలు పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గ్రామం పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండేందుకు గ్రామ స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థాయి సంఘాల ప్రతినిధులు మహిళా సంఘాలు శ్రద్ద వహించాలన్నారు.
అందరు కలిసి గ్రామం బాగుగా ఉండాలనే ఉద్దేశంతో వీధివీధిన తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకునేందుకు కషి చేయడం జరిగిందని భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణం అందించాలంటే పచ్చదనం పెంపొందించాలని, పరిశుభ్రంగా పాటిస్తే ఏలాంటి వ్యాధులు ప్రబలవని, అందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని చెప్పారు.
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చిట్టాపూర్ గ్రామానికి ఏడాదికి 45 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, ఆ విధంగా నాలుగు సంవత్సరాల పాటుగా మొత్తం ఒక కోటి 80 లక్షల రూపాయలు మంజూరు అవుతాయన్నారు. నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు, ఇతరత్రా అభివద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.
వన్నెల్ బి నుండి చిట్టాపూర్ గ్రామానికి బీటీ రోడ్డు, నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా మండలి భవనం మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. చిట్టాపూర్ గ్రామ రైతుల పంటపొలాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు, అందుకు కావాల్సిన లిఫ్టులు లేదా కాలువల ద్వారా ఏది అనుకూలంగా ఉంటే దానికనుగుణంగా గ్రామ రైతుల పొలాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.
అంతకుముందు మంత్రి, జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రతినిధులు మండల అధికారులతో కలిసి 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలనతో పాటు గ్రామ ప్రజలు సిసి రోడ్ల నిర్మాణానికి విన్నవించగా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. గ్రామంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు మాట్లాడుతూ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక విజయవంతంగా జరిగిందని ఇందులో భాగంగా కొన్ని పనులు జరిగాయని, మిగిలిపోయిన పనులకు కషి చేయాలని, ఇది ఆరంభం మాత్రమేనని నిరంతరంగా కొనసాగించాలని చెప్పారు. నూతన గ్రామపంచాయతీ చట్టం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 1606 రూపాయలు చొప్పున వివిధ పథకాల ద్వారా మంజూరు చేస్తుందని, ఈ గ్రామానికి ఏడాదికి 45 లక్షలు మంజూరు అవుతాయని, నిధులు ఖర్చు చేయడానికి గ్రామ సభ నిర్ణయాలు స్థాయి సంఘ సభ్యులు సర్పంచ్ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని, ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 17 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించి సిమెంట్ తయారుచేసే కంపెనీలకు, రోడ్ల నిర్మాణంలో వాడుకోవడానికి పంపించడం జరిగిందని, బయట చెత్త వెయ్యకుండా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. ఈ సందర్భంగా అవెన్యూ ప్లాంటేషన్ నాటిన మొక్కలకు ఉచితంగా ట్రీ గార్డ్స్ ప్లాస్టిక్ పడకుండా నిరోధించేందుకు జూట్ సంచులను ఉచితంగా అందజేసిన వ్యక్తులకు సన్మానం చేశారు.
ఇద్దరు సానిటేషన్ వర్కర్స్‌ను కూడా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్మూర్ శ్రీనివాస్, డి పిఓ జయసుధ, ఎస్ఆర్ఎస్పి ఎస్.ఇ. రామారావు, జెడ్పిటిసి, ఎంపీపీ, గ్రామ సర్పంచ్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- పోరు గర్జన గోడప్రతుల ఆవిష్కరణ - December 8, 2019
- 18 న మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు - December 8, 2019
- రజక యువతను విద్యా, ఉద్యోగాల్లో ప్రోత్సహించాలి - December 8, 2019