Breaking News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ జర్నలిస్టులకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు మర్చిపోయారని సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం అని అన్నారు.

కనీసం వారికి ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోవడం సరైనది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. వెంటనే జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, ఆక్రిడేషన్‌ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టులకు తమ మద్దతు ఉంటుందని వారు అన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *