Breaking News

ఎండివో కార్యాలయంలో విచారణ

నందిపేట్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కార్యాలయంలో మంగళవారం జిల్లాపరిషత్‌ డిప్యూటీ సీఈఓ క ష్ణమూర్తి విచారణ చేపట్టారు. 2016 ఆగస్టు నెలలో మరుగుదొడ్లు, గ్రామ పంచాయతీ ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తల్వేద గ్రామస్తులు అప్పటి కలెక్టర్‌ యోగితా రానాకు ఫిర్యాదు చేశారు.

గత మూడు సంవత్సరాల నుండి అధికారులు స్థాయిలో, మండల స్థాయిలో విచారణ చేపట్టారు. తాజాగా మంగళవారం మండల కార్యాలయంలో విచారణ చేపట్టి సంబంధిత రికార్డులను తనిఖీ చేసిన అనంతరం గ్రామస్తులతో మండల అభివద్ధి అధికారి నాగవర్ధన్‌తో మాట్లాడారు. సంబంధిత అధికారులపై బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఎండిఓపై చర్యలు తీసుకోండి

నందిపేట్‌ మండల అభివ ద్ధి అధికారి నాగవర్దన్‌ రాజకీయ అండదండలతో ఇక్కడ ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తల్వేద గ్రామస్తులు లోకా సాయి రెడ్డి, చింతా రమణ, నరేష్‌ గౌడ్‌, నసీర్‌ ఆరోపించారు.

ఇట్టి విషయమై ఎండిఓపై చర్యలు తీసుకోవాలని, గతంలో జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో, డిపిఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారులు తుతు మంత్రంగా విచారణ చేపట్టి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు, తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అభివద్ధి అధికారి ప్రశ్నించే వారి ఇళ్లలో పింఛన్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికుల కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారని, అర్హులు కానివారికి వికలాంగుల, వితంతు పెన్షన్‌లు ఇస్తే ఈ విషయం గతంలో ఫిర్యాదు చేస్తే వాటిని తొలగించారు, కానీ ఇప్పటివరకు వారి వద్ద నుండి డబ్బులు రికవరీ చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయాలు జడ్‌పి సిఇఓ కష్ణమూర్తి దష్టికి తీసుకెళ్లామని దానికి వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *