Breaking News

ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెండు సంవత్సరాలకు మద్యం అమ్మకాలకు దుకాణాలను కేటాయిస్తూ నిర్వహించిన లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఆప్కారి శాఖ ఆధ్వర్యంలో 2019 – 21 కొరకు జిల్లాలో మద్యం అమ్మకాలకు దుకాణాలను కేటాయించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. జిల్లాలో 91 దుకాణాలకు మద్యం అమ్మకాలకు అనుమతించడానికి దరఖాస్తులు ఆహ్వానించగా 1072 మంది డిపాజిట్‌ చేసి దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి దుకాణానికి కూడా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున దుకాణాల వారిగా కేటాయించడానికి దుకాణానికి వచ్చిన దరఖాస్తుదారుల టోకెన్‌ నంబర్లను లాటరీ పద్ధతిలో తీసి నంబర్‌ వచ్చిన వారికి దుకాణాన్ని కేటాయించారు.

మొత్తం 91 దుకాణాలకు గాను నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 18, 19 బీ బోధన్‌ డివిజన్‌ పరిధిలో 32, 41, 42 బీ ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో 60, 61, 62 మొత్తం 8 దుకాణాలకు కోర్టు ఉత్తర్వులు మరియు ఆబ్కారి శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు వాయిదా వేయడం జరిగిందని, మిగతా 83 దుకాణాలకు లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించడం జరిగిందని అధికారులు తెలిపారు.

వాయిదా వేసిన దుకాణాలు కూడా కమిషనర్‌ ఆదేశాలు రాగానే కేటాయించడం జరుగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌, ఈఎస్‌ నవీన్‌ చంద్ర, ప్రత్యేక అధికారి అనిల్‌ కుమార్‌, నిజామాబాద్‌ ఎసిపి శ్రీనివాస్‌ కుమార్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *