Breaking News

Daily Archives: October 19, 2019

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ప్రారంభించారు. ఒక లక్ష రూపాయల మున్సిపల్‌ సాధారణ నిదులతో మాజీ కౌన్సిలర్‌ కుంబాల రవి యాదవ్‌ బోరు మోటారును ప్రారంభించారు. కార్యక్రమంలో గల్లీ వాసులు అర్కల శ్రీనివాస్‌, రాజు, చంద్రయ్య, మల్లయ్య, నగేష్‌, రాము, నీలవేణి, ఈశ్వరి, సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధించాలని సంకల్పం ఉంటే ఎన్ని సవాళ్లనైనా అధిగమించి విజయం సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌ మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి ఆరవ కుస్తీ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారిణిలు అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని సదుపాయాలు లేకున్నా కూడా సర్దుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయాలను అందుకున్నారని తెలిపారు. సౌందర్య, మాలవత్‌ ...

Read More »

రైతులకు రుణ మంజూరులో ఉదారంగా ఉండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంటలు సాగుచేసే రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బ్యాంకర్స్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరులో సంతప్తికరమైన లక్ష్యాలు సాధించలేదని ఆయన తెలిపారు. రూ. 1751 కోట్లకు గాను 21.58 శాతంతో కేవలం 378 కోట్లు రూపాయలు మాత్రమే మంజూరు ...

Read More »

నాయకుల అక్రమ అరెస్టు

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ ఆర్‌టిసి జెఏసి కార్మికులిచ్చిన బంద్‌ జయప్రదానికి మద్దతుగా ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న శ్రేణులను మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్‌టిసి కార్మికుల సమ్మె డిమాండ్లు పరిష్కారం చేయకుండా నిర్భందంతో కార్మికుల గొంతు నొక్కాలని కుట్ర చేయడం ముఖ్యమంత్రి దిగజారుడుతనం అన్నారు. సకల జనుల సమ్మె తరహ ఉద్యమాలను ...

Read More »

బంద్‌ సంపూర్ణం

రెంజల్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. కాంగ్రెస్‌, బిజెపి, సిపిఎం నాయకులు ఉదయం నుండి రోడ్లపైకి వచ్చి ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్‌కు మద్దతు తెలిపారు. సాటాపూర్‌ తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేపట్టి బంద్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాపారులు, దుకాణదారులు కూడా స్వచ్ఛందంగా బంద్‌ పాటించి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. వివిధ పార్టీల నాయకులు సాయరెడ్డి, రాజేశ్వర్‌, జవేదోద్దీన్‌, సంతోష్‌, నసిర్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ...

Read More »

ఆలయ శిఖర ప్రతిష్టాపన

రెంజల్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని నల్ల పోచమ్మ, పెద్ద పోచమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ గోపురాలకు శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తులకు వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం నిర్వహించారు. గత రెండు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత నర్సయ్య, ...

Read More »

బంద్‌కు ఐఎప్‌టియు మద్దతు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బందులో భాగంగా ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ఆర్మూర్‌, మామిడిపల్లి, పెర్కిట్‌ లో దుకాణాలు బంద్‌ చేయడం జరిగింది. ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, జిల్లా నాయకులు సూర్య శివాజీ ఈ సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్‌ మొండి వైఖరి వల్లనే నేడు బందు అనివార్యమైందని వారు చెప్పారు. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాలని లేకుంటే కార్మికుల కోపాగ్నికి బలికాక ...

Read More »

అభివద్ధికి అడ్డులేము…

నందిపేట్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామ సర్పంచ్‌ ఎస్‌జి వాణి భర్త ఎస్‌జి తిరుపతి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని ఉప సర్పంచ్‌ రామచందర్‌ అన్నారు. నందిపేట్‌ మండల కేంద్రంలోని నంది గుడి వద్ద శనివారం ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం నందిపేట్‌ గ్రామ ఉప సర్పంచ్‌ రామచందర్‌ మీడియాతో మాట్లాడారు. నందిపేట సర్పంచ్‌ భర్త తిరుపతి శుక్రవారం బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించి రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై, ఉపసర్పంచ్‌పై ఆరోపణలు చేయడం పూర్తి నిరాధారమైనవని ...

Read More »

బంద్‌ సంపూర్ణం

నందిపేట్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం లో బంద్‌ ప్రశాంతంగా సాగింది. కాంగ్రెస్‌, తెలుగుదేశం బిజెపి, సిపిఎం నాయకులు ఉదయం నుండి రోడ్లపైకి వచ్చి ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి, బంద్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాపారులు, దుకాణదారులు కూడా స్వచ్ఛందంగా బంద్‌ పాటించి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. వివిధ పార్టీల నాయకులైన ఎస్‌జి తిరుపతి, ఎర్ర ముత్యం, మహిపాల్‌, సాగర్‌, ఉస్మన్‌, జమీల్‌ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ...

Read More »

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి డైరెక్టర్‌ మహమ్మద్‌ అలీ ముర్తుజా ఉద్బోదించారు. పాజిటివ్‌ దక్పథం, క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. నిజామాబాదు నగరంలోని ప్రధాన్‌ మంత్రి కౌషల్‌ కేంద్రంలో శనివారం వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం ఆద్వర్యంలో కలాం వారోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యువ సాధికారత, విజన్‌ 2020 అనే అంశాలపై నిర్వహించిన సదస్సులో డిడి ముర్తుజా ముఖ్యాతిధిగా హాజరై ...

Read More »