Breaking News

మహిళా సర్పంచ్‌ను ఇబ్బందులు పెట్టడం న్యాయమా…?

నందిపేట్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సర్పంచ్‌ అయినందున టిఆర్‌ఎస్‌ నాయకులు ఇబ్బందులు పెట్టడం న్యాయమా అని నందిపేట్‌ సర్పంచ్‌ ఎస్‌జి వాణి ప్రశ్నించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నందిపేట టిఆర్‌ఎస్‌ నాయకులు శనివారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని, ఉప సర్పంచ్‌ 60 లక్షల రూపాయల విలువ గల చెక్కులపై సంతకాలు పెట్టినట్లు చెప్పడం పూర్తి అవాస్తవమన్నారు. కేవలం 30 లక్షల విలువ గల చెక్కుల పైన మాత్రమే సంతకాలు పెట్టాడని, మరికొన్ని వాటిపై తనకు కమిషన్‌ ఇస్తేనే సంతకాలు పెడ్తానన్నాడని వార్డు సభ్యులు, ఎస్‌జి తిరుపతి ఆరోపించారు.

ఎమ్మెల్యేకు సవాల్‌

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉంటుందని, ఇప్పుడు తాను వార్డు సభ్యునిగా, తన భార్య ఎస్‌జి వాణి సర్పంచ్‌గా ఉన్నందున టిఆర్‌ఎస్‌ నాయకులు ఇలా వేధించడం సరికాదని, తనను ఇలాగె వేధిస్తే వచ్చే ఎన్నికల్లో జీవన్‌ రెడ్డిపై పోటీగా తానే నిలబడతానని, దమ్ముంటే గెలిచి చూపించుమని సవాల్‌ చేసారు.

వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు

తన వ్యక్తి గత విషయాల జోలికి రావద్దని టిఆర్‌ఎస్‌ నాయకులకు హితువు పలికారు. శనివారం జరిగిన పత్రిక సమావేశంలో టిఆర్‌ఎస్‌ నాయకులు తన వ్యక్తిగత విషయాల గూర్చి, అమ్మానాన్నల గూర్చి మాట్లాడం శోచనీయమన్నారు. వార్డు సభ్యులు మాన్పూర్‌ భూమేష్‌పై, సాగర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తాను సాయి కాలేజ్‌ కరెస్పాండెంట్‌ సంతోష్‌ వద్ద 10 రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేసానని అబద్దపు ఆరోపణ చేయడం సరికాదని, ఇట్టి విషయం సంతోష్‌తో తాను ఫోన్‌ మాట్లాడితే తాను 10 రూపాయల వడ్డీ చెల్లించలేదని ఒప్పుకోవడం తనకు ఊరట కలిగించిందన్నారు.

సమావేశంలో మాట్లాడిన బిజెపి నాయకులు ఎమ్మెల్యే గత ఆరు సంవత్సరాలుగా నందిపేట గ్రామానానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని, గ్రామాన్ని దత్తత తీసుకోవడం వరకే కానీ నందిపేట గ్రామం ఎలాంటి అభివద్ధికి నోచుకోలేదని ధ్వజమెత్తారు.

గ్రామంలోని ప్రధాన రహదారి పూర్వం ఎలా ఉందొ, ఇప్పటికి అలాగే ఉందని ఆరోపించారు. గత పాలకవర్గంలోని సర్పంచ్‌ – సభ్యులు అందరు కూడ తెరాస వారే అధికారంలో ఉన్నప్పటికీ గ్రామానికి ఎలాంటి అభివద్ధి చేయకుండా గాలికి వదిలేశారని, ఇప్పుడు బిజెపి పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌ ఎలాంటి అవినీతి, కమీషన్లకు ఆశపడకుండా గ్రామ అభివద్ధికి పాటుపడుతుంటే ఓర్వలేక తెరాస నాయకులు అడ్డంకులు సష్టించడం సరికాదన్నారు.

దీనిని మానుకొని గ్రామ అభివద్ధి కొరకు తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు, ఎంపిటిసి పెంటర్‌ రాజు, పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *