Breaking News

కార్మికుల సమ్మెకు తెలంగాణ ఐకెపి వివోఏ సంఘం మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో గత 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుండగా వారి సమ్మెకు తెలంగాణ ఐకెపి వివోఎ యూనియన్‌ కామారెడ్డి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల శిబిరాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి తెలంగాణ ఐకెపి వివోఎల యూనియన్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పటాన్‌ గౌస్‌ ఖాన్‌, జిల్లా అధ్యక్షులు బాబా గౌడ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్ది రాములు తదితరులు మాట్లాడారు. సమ్మె చేస్తున్న కార్మికుల డిమాండ్లు తక్షణమే పరిష్కారం చేయవలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హై కోర్ట్‌ ఆ దేశాలను తుంగలో తొక్కి, ఆర్టీసీ జేఏసీనీ చర్చలకు పిలువకుండా, ప్రజల జీవితాలతో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చలగాటమాడుతుందన్నారు.

శనివారం తెలంగాణ బంద్‌ ద్వారాన్తెనా ప్రభుత్వం మేల్కొని తక్షణమే చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేకుంటే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి వివోఏలు సంఘీభావంగా ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

బందు జయప్రదం చేసిన ప్రజలకు, కార్మికులకు వ్యాపార వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఐకెపి వివోఎల యూనియన్‌ కామారెడ్డి జిల్లా నాయకులు, రవి, సంతోష్‌ గౌడ్‌, దుర్కికి సాయిలు, విక్రమ్‌ పండరి, సర్వయ్య, రాజయ్య, అశోక్‌, సచిన్‌, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉచిత కంటి వైద్య శిబిరం

బీర్కూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నసురుల్లాబాద్‌ మండలంలోని హజీపూర్‌ గ్రామ పంచాయితీలో లయన్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *