కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో సోమవారం అఖిలాభారతీయ ప్రజా సేవ సమితి సమాచార చట్టం అద్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్ రావు అధ్యక్షత వహించి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 14 సంత్సరాలు పూర్తయినా, దాని లక్ష్యం ఇప్పటికి ప్రజలకు అందుబాటులోకి రాలేదని, చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది ఇప్పటికి అమలు కావటం లేదని ఆవేదన ...
Read More »Daily Archives: October 21, 2019
బజారున పడ్డ పంచాయతీ
నందిపేట్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో మొదటి సారిగా చెక్ పవర్ ఉప సర్పంచ్‌కు ఇవ్వడం వివాదస్పదం అవుతుంది. సర్పంచ్, ఉప సర్పంచ్ నువ్వా నేనా అంటూ వివాదాలకు దిగుతున్నారు. ఫలితంగా గ్రామ అభివద్ధికి నిధులు వాడకంలో జాప్యం జరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి 30 రోజుల ప్రణాళిక అమలు చేసిన అన్ని గ్రామాలలో నిధుల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. సర్పంచ్‌తో సమానంగా ఉప సర్పంచ్‌లు కూడ గ్రామ అభివద్ధిలో ...
Read More »కాంగ్రెస్ నాయకుల అరెస్టు
నందిపేట్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ నుండి హైద్రాబాద్ ప్రగతి భవన్ ముట్టడికి నాయకులు వెళ్లకుండ నందిపేట్ పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నందిపేట్ యువజన కాంగ్రెస్ నాయకులు మంద మహిపాల్, ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులు బైండ్ల ప్రశాంత్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
Read More »పోలీస్ కిష్టయ్యకు నివాళి
నందిపేట్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం పురస్కరించుకొని నందిపేట మండలంలోని తొండకూర్ గ్రామంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య అమరుడయ్యాడని, ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవన్న, ఉపసర్పంచ్ రాజేందర్, పలువురు వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.
Read More »22న శ్రీపద్మావతి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 22 ఉదయం 9 గంటలకు ఇందూరు తిరుమల క్షేత్రంలో నిర్మించిన శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్టు మాపల్లె చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు పేర్కొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారు ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నట్టు తెలిపారు. వారితో పాటు వైవి.సుబ్బారెడ్డి, టిటిడి చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సినీ నిర్మాత దిల్ రాజు, పలువురు సినీ ప్రముఖులు విచ్చేస్తున్నట్టు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ...
Read More »24, 25 తేదీలలో బ్యాంకులు కస్టమర్లకు చేరువయ్యే కార్యక్రమం
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 24, 25 తేదీలలో బ్యాంకుల సేవలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ పాణిగ్రాహి తెలిపారు. సోమవారం వినాయక్ నగర్‌లోని ఎస్బిఐ పరిపాలన విభాగంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక బస్వా గార్డెన్ కళ్యాణ మండపంలో రెండు రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 24వ తేదీన ఉదయం 9:30 ...
Read More »పోలీస్ అమరవీరులకు నివాళి
నందిపేట్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం పోలీసు అమర వీరులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. 1959లో అమరులైన సీఆర్పీఎఫ్ పోలీసులను స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని నందిపేట్ ఎస్ఐ రాఘవేందర్ అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు.
Read More »డిపో వద్ద కుటుంబాలతో ధర్నా
ఆర్మూర్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఐకాస పిలుపుమేరకు ఆర్మూరు డిపో వద్ద ఆర్టీసీ కుటుంబాలతో కలిసి కెసిఆర్ ప్రభుత్వం నిరంకుశ విధానాలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తన్న, దాసు, సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఆర్టీసీ ఐకాస కన్వీనర్ చిలుక రవి, కో కన్వీనర్ నర్సింలు, పీవైఎల్, పిడిఎస్యు, అరుణోదయ నాయకులు పాల్గొని కార్మికుల పాటలు పాడి ఉత్తేజపరిచారు.
Read More »చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడానికి యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈయేడు సమద్ధిగా వర్షాలు కురిసిన రైతులకు ఇబ్బంది కలగకుండా కనీస మద్దతు ధర ...
Read More »