Breaking News

సమాచార చట్టంపై అవగాహన

కామారెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో సోమవారం అఖిలాభారతీయ ప్రజా సేవ సమితి సమాచార చట్టం అద్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అధ్యక్షత వహించి మాట్లాడారు.

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 14 సంత్సరాలు పూర్తయినా, దాని లక్ష్యం ఇప్పటికి ప్రజలకు అందుబాటులోకి రాలేదని, చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది ఇప్పటికి అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పిఐఓ, ఏపిఐఓ, అప్పిలేట్‌ అధికారి పేర్లు స్పష్టంగా కనిపించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అది బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రతి కార్యాలయంలో 4 (1) బి రిజిస్టర్‌1, రిజిస్టర్‌ 2 తప్పక ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి వ్యక్తి కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో ఇవ్వాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగితే 24 గంటల లోపు సమాచారం ఇవ్వాలని అంకం శ్యామరావు పేర్కొన్నారు.

Check Also

సరైన ప్రణాళికతో ఎకనామిక్‌ సెన్సెస్‌ సర్వే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం మినహా ఇతర అన్ని వృత్తుల ఆర్థిక సర్వే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *