Breaking News

పెరటి తోట

నందిపేట్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యమే మహాభాగ్యం .. ఈ నినాదం కాస్తా నీరు గారిపోతుంది .విపరీత రసాయనాలతో పండిస్తున్న ఆహారోత్పత్తులు చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధుల భారిన పడేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపడానికి పలువురు సేంద్రియ పంటల సాగుచేస్తున్నారు.

ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి మిద్దె సాగు, పెరటి సాగు చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు నందిపేట గ్రామ వాసి షేక్‌ జవీద్‌. వ్యాపారం చూసుకునే ఆయనకు మూడేళ్ళ కిందట వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఇంటి ముందు గల ప్లాట్‌ కొనుగోలు చేసి స్థలంలో కూరగాయల సాగు చేపట్టారు. వంటింటి అవసరాలు తీర్చుకొని ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యమైన ఆహారం తీసుకొంటున్నామని చెబుతున్నారు.

తాజా కూరలు తింటున్నాం..ఇంటి అవసరాలు తీర్చుకోగా అదనంగా వస్తే బంధువులకు ఇస్తాం. ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ పంటలు తినాల్సిందే. సొర కాయలు ఎక్కువగా అవుతున్నాయి. వాటిని కాలనీలో అందరికి ఉచితంగా ఇచ్చి స్నేహం పెంచుకుంటున్నారు. రసాయన ఎరువులు లేకపోవడంతో కూరలు రుచికంగా ఉంటున్నాయి. యూట్యూబ్లో సాగు విధానం తెలుసుకొంటు కూరగాయలు పెంచుకుంటున్నారు.

పెరటి తోటతో ఆరోగ్యం

ఉదయం పూట పెరటి తోటలో సమయం కేటాయిస్తే ఆరోగ్యం హుషారుగా వుంటున్నది. వ్యాయామం చేసినట్లు ప్రొద్దున పూట పెరటి తోటలో పని చేస్తే బిపీ, షుగర్‌ లాంటి వ్యాధులు రావు అని పత్రికలలో చదివాను, పెరటి తోటలో వున్నప్పుడు వ్యాపార, దైనందిన జీవిత టెన్షన్‌ నుండి ఉపశమనం కలుగుతుంది.

Check Also

ఆసరా పించన్‌ల పంపిణీ

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *