Breaking News

రైతులు దళారులను ఆశ్రయించొద్దు

రెంజల్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయవద్దని తహసిల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ అన్నారు. మండలంలోని దూపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక సహకరసంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని దళారులను ఆశ్రయించవద్దని అన్నారు.

రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులకు గిట్టుబాటును అందించేందుకే ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని అన్నారు. కష్టించి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ సాయరెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ నారాయణ, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, కార్యదర్శి జీవన్‌ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆసరా పించన్‌ల పంపిణీ

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *