Breaking News

సమ్మెకు మద్దతుగా వామపక్షాల ర్యాలీ

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టి 18 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా లెఫ్ట్‌ పార్టీలైన సిపిఎం, సిపిఐ, ఆర్‌ఎస్‌పిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి 18 రోజులు గడుస్తున్నా వారి సమస్యలు పరిష్కరించకుండా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, తమ తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆర్‌ఎస్పి జిల్లా కార్యదర్శి కొత్త నరసింహ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యేల జీతాల్లో వాటాలు గాని, వారి ఆస్తుల్లో వాటాలు గాని అడగటం లేదని, రాజ్యాంగబద్ధంగా వారి హక్కుల కోసం పోరాటం చేస్తుంటే సమ్మె విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను ఉధతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దశరథ్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సమ్మె పట్ల కొందరు పోలీస్‌ అధికారులను ఉపయోగించి విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నుతున్నారని పోలీసులు తమ తీరును మార్చుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన విషయాన్ని మర్చిపోతే తను కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుందని ఆయన సూచించారు.

కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్‌ గౌడ్‌, నాయకులు సిపిఐ జిల్లా నాయకులు బాలరాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గణేష్‌, డ్రైవర్‌ అసోసియేషన్‌ నాయకులు శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *