Breaking News

భాస్కర్‌రావు అంత్యక్రియలకు హాజరైన షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్‌ తండ్రి కైలాస్‌ భాస్కర్‌ రావు స్వర్గస్తులైనారు. వీరి దహన సంస్కారంలో మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ హాజరయ్యారు. భాస్కర్‌రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భాస్కర్‌రావు అంతిమయాత్రలో పాల్గొని, దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కైలాస్‌ శ్రీనివాస్‌ను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *