Breaking News

పోస్టర్ల ఆవిష్కరణ

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కుమార్‌ నారాయణ భవన్‌ వద్ద న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు బొటనవేలు తెగ్గొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కెసిఆర్‌ నిరంకుశ పాలన నశించాలని ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌ని అరెస్టు చేసి ఖమ్మంకు తరలించినప్పుడు ఖమ్మంలో కెసిఆర్‌కి అండదండగా ఉద్యమానికి మద్దతుగా పోరాడిన పోటు రంగారావుకు నేడు ఆర్టీసీ బంద్‌ సందర్భంగా పోలీసులు నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా ఆయన బొటనవేలు తెగిపోవడానికి కారకులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఖమ్మంలో నిన్ను బతికించిన రంగన్నకు ఆయన బొటనవేలు తెగ్గొట్టి కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహుమానంగా ఇచ్చిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ రాచరిక పోకడలు అనుసరిస్తున్న కెసిఆర్‌కి తగిన బుద్ధి తప్పకుండా తెలంగాణ సమాజం తగిన సమయంలో చెబుతుందన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమంటే ఆ ఒక్కటి తప్ప మిగితా డిమాండ్లపై చర్చిస్తామనడం, అట్లాగే కార్మికులే విలీనం అనే డిమాండ్‌ని వదులుకున్నారని తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి ఆర్‌టిసి విలీనంతో సహా అన్ని డిమాండ్లను పరిష్కరించాలని వారన్నారు.

కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు దేవారం ముత్తన్న, రాజన్న, పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, రాకేష్‌, శ్రీనివాస్‌, పిడిఎస్‌యు నాయకులు నరేందర్‌, దుర్గ ప్రసాద్‌, రైతు కూలీ సంఘం నాయకులు ఎల్లయ్య, పూమనీ శంకరం తదితరులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *