Breaking News

Daily Archives: October 25, 2019

హిందూ సంఘాల సమావేశం

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ కోంపల్లి పెట్‌ బషీర్‌ బాగ్‌ (శ్రీ రాంనగర్‌) ప్రాంతంలో హైదరాబాద్‌ నగరానికి చెందిన పలు హిందూ సంఘాల ప్రతినిధులు ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, అలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన కట్టమైసమ్మ అమ్మవారి ఆలయాన్ని కూల్చిన విషయంలో అఖిల పక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. దేవాలయం కూల్చివేసిన విషయంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఏవిధంగా ఆలయాన్ని అబివద్ది పరచాలని హిందువులందరూ సంఘటితంగా వుండాలని, కూల్చివేసిన ...

Read More »

పరామర్శ

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డీసీసీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు తండ్రి కైలాస్‌ భాస్కర్‌ రావు పరమపదించినందున ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ శుక్రవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు.

Read More »

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాసనసభ వ్యవహారాల, గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. భీంగల్‌ మండల కేంద్రంలో నేషనల్‌ అకాడమీ ఆప్‌ కన్స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు వివిధ కేటగిరిలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధి లేక యువత అక్రమ మార్గంలో ...

Read More »

చెక్కుల అందజేత

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్‌ పండ్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఏడు మందికి నాలుగు లక్షల 15 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు.

Read More »

పేదల ఆత్మగౌరవం పెంపొందించేందుకే…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు రెండు పడకల గదుల నిర్మాణం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం బిబిపూర్‌ తండాలో 4 కోట్ల 35 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 50 రెండు పడకల గదుల ఇళ్ళను ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వివి గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ ...

Read More »

కలెక్టర్‌కు అభినందనలు తెలిపిన అధికారులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సంస్థ ద్వారా జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ నెల 24న గవర్నర్‌ ద్వారా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, ఏఓ శ్రీధర్‌, ఏడి మార్కెటింగ్‌ రియాజుద్దీన్‌ శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ చాంబర్‌లో కలిసి అభినందనలు తెలిపారు. వారికి పుష్పగుచ్ఛం అందించారు.

Read More »

జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సమిష్టిగా కషి చేద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రతినిధులందరం ప్రజల కోసమే పని చేయడానికి ఉన్నాం కాబట్టి సమిష్టిగా కషిచేసి ప్రజల సమస్యలు తీర్చడానికి, జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కషి చేద్దామని రాష్ట్ర రహదారులు భవనములు, శాసనసభ వ్యవహారాలు, గహ నిర్మాణాలు శాఖామంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పేదలు, రైతుల ...

Read More »

రోడ్డు ఆక్రమణలతో ప్రమాదాలు

నందిపేట్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాలకు తగ్గించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు కొంతమంది రైతులు మాత్రం దీనిని తమకు అనుకూల అవకాశంగా మల్చుకుంటున్నారు. రాష్ట్ర గ్రామీణ రహదారులన్నీటిని రైతులు పంటలను ఆరబెట్టుకునెందుకు అక్రమిస్తుంటే అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోజురోజుకి ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని నందిపేట్‌ నుండి ఆర్ముర్‌ వెళ్లే రహదారిలో సగభాగం రైతులు ఆక్రమించుకున్నారు. మక్కలు, వరి కోతలు ప్రారంభమై ...

Read More »

అమత ఫలం – సీత ఫలం

నందిపేట్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీతాఫలం అంటే ఇష్టపడనివారు ఉండరు. చిన్న పిల్లల నుండి పండు ముదుసలి వరకు ఇష్టంగా తింటారు. వర్షాకాలం చివరలో శీతాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే ఈ ఫలాలలో ఔషద గుణలు, పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం గ్రామాలలోనే కాకుండా నగరంలో ఎక్కడ చూసినా సీతాఫలాలు దర్శనమిస్తున్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, విటమిన్‌ సి, ఎలు సమద్ధిగా లభించే ఈ పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. శరీరంలో ఉండే వ్యర్థ ...

Read More »

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం పార్టీ ఆర్మూర్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం నిజాంసాగర్‌ కెనాల్‌పై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం ఆర్మూర్‌ కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు గత 21 రోజుల నుండి సమ్మె చేస్తుంటే వాళ్ల సమస్యలు పరిష్కరించుకండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేస్తానని, ఆర్టీసీ పని అయిపోయిందని యూనియన్‌లు ...

Read More »

ఆయుర్వేద వైద్యం పాటించ తగింది

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పూర్వకాలం నుంచి ఆయుర్వేదాన్ని మనదేశంలో పాటిస్తున్నామని అది ఇప్పటికి కూడా పాటించతగిందేనని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుర్వేద వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌ మైదానంలో జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ఆయుర్వేద వాక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధన్వంతరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దేశంలో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, పూర్వ కాలం నుండి ఆయుర్వేద, యునాని, సిద్ధ వైద్య ...

Read More »