Breaking News

అమత ఫలం – సీత ఫలం

నందిపేట్‌, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీతాఫలం అంటే ఇష్టపడనివారు ఉండరు. చిన్న పిల్లల నుండి పండు ముదుసలి వరకు ఇష్టంగా తింటారు. వర్షాకాలం చివరలో శీతాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే ఈ ఫలాలలో ఔషద గుణలు, పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం గ్రామాలలోనే కాకుండా నగరంలో ఎక్కడ చూసినా సీతాఫలాలు దర్శనమిస్తున్నాయి.

కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, విటమిన్‌ సి, ఎలు సమద్ధిగా లభించే ఈ పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను శుభ్రపరిచే గుణం ఈ ఒక్క పండుకే సొంతమని అంటున్నారు. ఎముకలు బల పడటంలో తోడ్పడతాయి. సీతాఫలం గుజ్జుతో ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తారు. సీతాఫలంలో క్రిములను నాశనం చేసే గుణం ఉండటంతో వ్యవసాయంలో క్రిమిసంహారక మందులలో ఉపయోగిస్తున్నారు. గింజలతో తీసిన నూనెతో పెస్టిసైడ్స్‌ తయారీ లోవాడుతారు.

సీతాఫలంలో లభించే ఔషద విలువలు

సీతాఫలంలో ముఖ్యంగా సి విటమిన్‌ ఉంటుంది. దీనిని తినడం వల్ల కంటి చూపు, వెంట్రుకలు, చర్మానికి చాలా మంచిది. సీతాఫలాల్లో గుజ్జును జ్యూస్‌లా చేసి స్పటిక, చక్కెర లేదా బెల్లంతో కలిపి తాగితే బాలింతలకు, ఎదిగే పిల్లల ఆరోగ్యానికి మంచిది. ఈ పండులో ఫైచర్‌ వల్ల అజీర్తి, మలబద్దకం తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. దీనిలోని కాల్షియం వల్ల ఎముకలు బలహీనంగా ఉన్నవారికి, పెరిగే పిల్లలకు ఎముకలు గట్టి పడటానికి దోహదం చేస్తాయి.

గుండె జబ్బులు, నరాలు, కండరాలు బలహీనంగా ఉన్న వారికి పోషకాహారంగా ఉపయోగపడతాయి. చర్మ వ్యాధిగ్రస్తులకు యాంటి సెప్టిక్‌గా పని చేస్తాయి. ఈ ఫలం గుజ్జును చర్మంపై ఏర్పడ్డ గడ్డలకు కడితే అవి తొందరగా మానుతాయి. వీటి గింజలను పొడి చేసి తలవెంట్రుకలకు పెడితే పేలు, చుండ్రు ఉన్నా తగ్గిపోతాయి.

కొండలలో గుట్టలలో ఖాళీ అడవులలో పెరిగే సీతాఫలం చెట్లకు నీరు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. గత సంవత్సరం కంటే ఈ యేడు వర్షాలు సమద్ధిగా పడడం తో ఎక్కువగానే పండ్లు కాశాయి.

సీతాఫలాలు కొండల్లో గుట్టలోంచి సేకరిస్తారు. ఎంతో శ్రమతో అటవీ ప్రాంతాల నుండి సేకరించి నందిపేట్‌ మండలానికి తెస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి చుట్టు పక్కల అటవీ ప్రాంతాల నుండి తెస్తున్నామని, ఇంత దూరం తీసుక వస్తున్నామని, వ్యాపారం బాగానే సాగుతుందని సీతాఫలాలు అమ్మే మహిళలు తెలిపారు.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article