Breaking News

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాసనసభ వ్యవహారాల, గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. భీంగల్‌ మండల కేంద్రంలో నేషనల్‌ అకాడమీ ఆప్‌ కన్స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు వివిధ కేటగిరిలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఉపాధి లేక యువత అక్రమ మార్గంలో ప్రయత్నించ కూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి 27 కేంద్రాల్లో నేషనల్‌ అకాడమీ ఆప్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కనీసం జిల్లాకు ఒక్క కేంద్రమైనా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.

ఆర్మూర్‌ డివిజన్‌ లోని బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు కరెంటు సర్వే, ప్లంబర్‌ వివిధ కేటగిరిలో వందమంది యువతకు నైపుణ్య శిక్షణ మూడు మాసాలలో అందించిన తర్వాత ప్రైవేట్‌ రంగంలో తప్పనిసరిగా ఉపాధి కల్పించేందుకు న్యాక్‌ (యన్‌ఏ.సి) కషి చేస్తుందని చెప్పారు. ఈ ప్రాంత యువత నైపుణ్యత శిక్షణ లేని వారు గల్ఫ్‌ కు ఉపాధి కోసం వెళ్లినా ఇబ్బందులు పడుతూ ఆశించిన ఆదాయం రానివారు విధిలేక అక్కడే ఉండి అవస్థలకు గురవుతున్నారని, నైపుణ్య శిక్షణ ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లి ఉపాధి పొందవచ్చునని చెప్పారు.

బయట దేశాల్లో ఇబ్బంది పడుతున్న వారిని తీసుకువచ్చి నైపుణ్య శిక్షణ ఉచితంగా అందజేసి వారి కాళ్లపై వారే నిలబడే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. ఈ ప్రాంతానికి బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు కాలేశ్వరం ప్రాజెక్ట్‌ ప్యాకేజ్‌ 21 ద్వారా అందిస్తామని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి పండించిన పంటకు మద్దతు ధర పెట్టుబడి సాయం 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నట్లు, తద్వారా యువత వ్యవసాయ రంగంలో రాణిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

యువత భవిష్యత్తు బాగుండాలని యువతకు ఉపాధి అవకాశాలు దొరికినప్పుడే వద్ధి కలుగుతుందని అన్నారు. ఉపాధి అవకాశం లేక ఇబ్బంది పడకూడదని యువతకు న్యాక్‌ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ డైరెక్టర్‌ జనరల్‌ బిక్షపతి మాట్లాడుతూ దేశంలో అత్యుత్తమ సంస్థ అని జాతీయ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ లక్షలాది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించినట్లు చెప్పారు.

ఈ సంస్థ ద్వారా నాలుగు లక్షల మందికి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచినట్లు చెప్పారు. దేశంలో నాలుగు కోట్ల 30 లక్షల మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సంస్థ చైర్మన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ చైర్మన్‌గా రోడ్లు భవనాల శాఖ మంత్రి చీఫ్‌ సెక్రెటరీ ఉంటారని చెప్పారు. ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు.

ఈ సందర్భంగా మంత్రి న్యాక్‌ ద్వారా నైపుణ్య శిక్షణ అందించే ట్రేడ్‌ వివరాలు గల బ్రోచర్‌ విడుదల చేసారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఆర్‌డిఓ శ్రీనివాస్‌, జడ్పిటిసి, ఎంపిపి తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article