Breaking News

పేదల ఆత్మగౌరవం పెంపొందించేందుకే…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు రెండు పడకల గదుల నిర్మాణం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం బిబిపూర్‌ తండాలో 4 కోట్ల 35 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 50 రెండు పడకల గదుల ఇళ్ళను ప్రారంభించారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వివి గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఐదు సంవత్సరాల్లో పేదలు, రైతుల కోసం సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు.

ప్రభుత్వం ఆలస్యంగా నైనా అర్హులైన అందరికీ రెండు పడకల గదులను నిర్మించి ఇస్తామని, చేతులు దులుపుకొని ఎటు వెళ్లడం లేదని ఎన్ని కట్టినా నాణ్యతతో పటిష్టంగా నిర్మిస్తామని నిరంతరంగా ఉంటుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదం కెసిఆర్‌కు ఉన్నంతకాలం అమలు చేస్తామని అందరికీ ఒకేసారి నిర్మించి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన దశలవారీగా నిర్మించి పేదలకు అందజేస్తామని మంత్రి అన్నారు.

శాసన సభ్యులకు గౌరవం పెరగాలంటే స్థానిక ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పనిచేసి నియోజకవర్గ అభివద్ధికి కషిచేయాలని చెప్పారు. కాలేశ్వరం ప్యాకేజీ 21 రూరల్‌ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులను వేగవంతంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నట్లు, అందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

రైతుల పొలాల నుండి రెండు మీటర్ల లోతులో పైప్‌ లైన్‌ వేయాల్సి ఉందని, అందుకు గ్రామ రైతులకు ప్రాజెక్ట్‌ యొక్క ఉపయోగాలను వివరించి అవగాహన కల్పించి సాఫీగా సాగే విధంగా కషి చేయాలన్నారు. కొందరు ప్రాజెక్టు పూర్తి చేయొద్దనే ఉద్దేశంతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాన్ని ఎదుర్కొని ముందుకు పోయే విధంగా తగిన కషి అవసరమని చెప్పారు.

రూరల్‌ నియోజకవర్గంలో అవసరమైన రహదారులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ నియోజవర్గంలో మొట్టమొదటిసారిగా నిరుపేదలకు రెండు పడకల గదులను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నియోజక వర్గంలో 1700 గహాలు మంజూరయ్యాయని, అవి వివిధ ప్రగతి దశలో ఉన్నాయని గహాలను నిర్మించేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ మహమ్మద్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు.

నియోజక వర్గ అభివద్ధికి తనతోపాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరు బాధ్యతతో పనిచేసి జిల్లాలో నియోజవర్గ అభివద్ధి మిగితా నియోజకవర్గాల కంటే ముందుంటుందని, లబ్ధిదారులకు కేటాయించిన గహాలను అమ్మినా, కొనుగోలు చేసినా ఇరువురుపై కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.

శాసన మండలి సభ్యులు విజి గౌడ్‌ మాట్లాడుతూ గతంలో ఇంటికి 70 వేల రూపాయల సబ్సిడీ ఇచ్చేవారని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పేదల గౌరవాన్ని ఉన్నతిని చాటిచెప్పాలని ఉద్దేశంతో రెండు పడక గదుల నిర్మాణాలను చేపట్టినట్లు, గ్రామాల్లో పేద ప్రజలు రెండు పడకల గదుల నిర్మాణాల కోసం ఎదురుచూస్తున్నారని, 120 గజాలు నివాస స్థలం ఉన్న వారందరికీ రెండు పడకల గదుల నిర్మాణాలను మంజూరు చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ పేదవారు గౌరవప్రదంగా జీవించాలని, ఉన్నతమైన ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు పడకల గదుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మూడు కోట్ల 40 లక్షల వ్యయంతో 50 గహాలు పూర్తి చేయగా, అందులో 62 లక్షల రూపాయలు అదనంగా మౌలిక వసతుల కోసం ఖర్చు చేసినట్టు చెప్పారు. రూరల్‌ నియోజవర్గంలో ఎలాంటి ఇసుక కొరత లేదని, ఈ ప్రాంతంలో 10 పాయింట్లను గుర్తించినట్లు చెప్పారు.

ప్రభుత్వం ద్వారా అమలయ్యే అభివద్ధి కార్యక్రమాలకు ఇసుక ఇబ్బందులు లేకుడా ముందుకు పోతున్నట్లు రైతు శ్రేయస్సు కోసం వరి పంటకు మద్దతు ధర కల్పించేందుకు గత సంవత్సరం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు పండించిన పంట యొక్క చివరి గింజ వరకు కొనుగోలు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు మెరుగైన పద్ధతిలో సేకరణ చేస్తామని అయితే రైతులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

కార్యక్రమంలో ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, డిసిఓ సింహాచలం, జడ్పిటిసి ఇంద్ర, ఎంపీపీ భూమన్న, సర్పంచ్‌లు లక్ష్మీబాయి, తారాసింగ్‌, స్వప్న, మోహన్‌, ధర్పల్లి జడ్పిటిసి జగన్‌, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article