Breaking News

జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సమిష్టిగా కషి చేద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రతినిధులందరం ప్రజల కోసమే పని చేయడానికి ఉన్నాం కాబట్టి సమిష్టిగా కషిచేసి ప్రజల సమస్యలు తీర్చడానికి, జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కషి చేద్దామని రాష్ట్ర రహదారులు భవనములు, శాసనసభ వ్యవహారాలు, గహ నిర్మాణాలు శాఖామంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ సమావేశం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పేదలు, రైతుల కోసం ఐదు సంవత్సరాలుగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారని, అవి సత్ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని, ఇంకా అక్కడక్కడ ఏమైనా సమస్యలుంటే వాటిని కూడా మనమంతా బాధ్యతగా నిర్వహించడానికి ప్రయత్నం చేద్దామన్నారు. అదే పరమావధిగా బాధ్యతగా మనమంతా విధులు నిర్వహిద్దామని మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంత రైతుల విషయంలో నాకంటే మీకే ఎక్కువగా ప్రజలతో అనుబంధం ఉంటుంది కాబట్టి వారి సమస్యల విషయంలో మీకే ఎక్కువగా అవగాహన ఉంటుందని ప్రజలు ముందుగా మండల స్థాయి ప్రతినిధులైన మీ వద్దకే వస్తారని ఎంపీపీలు జెడ్‌ పిసిలతో అన్నారు. అందువల్ల మీ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పని చేయాలని, అయినా కూడా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దష్టికి, తన దష్టికి తీసుకువస్తే కలిసి పరిష్కరించుకుందామని, ప్రజల సమస్యలు తీరుస్తామని ఆయన తెలిపారు.

నెల రోజుల పాటు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రజలు భాగస్వాములై వారి సహకారంతో విజయవంతమైందని, గ్రామాలు బాగుపడతాయని పరిశుభ్ర వాతావరణం ఏర్పడిందని ఇదంతా మీరు కూడా గమనించారని తెలిపారు.

ప్రతి నెల గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుందని, తన రాజకీయ జీవితంలో ప్రజలు భాగస్వాములైన ఇంత మంచి కార్యక్రమాన్ని తాను చూడలేదని తెలుపుతూ కమిట్మెంట్‌ పట్టుదలతో పని చేస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని ఇందుకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రజలు తల ఎత్తుకొని జీవించే విధంగా వారికి అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలనే లక్ష్యంతో భారత దేశంలో రాష్ట్రాన్ని ముందువరుసలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి అనుక్షణం ఆలోచిస్తున్నారని తెలిపారు.

ఇందుకు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ కాలేశ్వరం ప్రాజెక్టు కళ్యాణ లక్ష్మి తదితర కార్యక్రమాలు ఒక ఉదాహరణ అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్‌ 330 కిలోమీటర్ల గోదావరి నీటిని వెనుకకు మళ్ళించే బహత్తర కార్యక్రమం అన్నారు. ప్యాకేజీ 21 పనులు జరగాలని పట్టుదలతో ఒక యజ్ఞంలా నిర్వహించడానికి కషి చేస్తున్నామని, ఎస్‌ ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవం ద్వారా ప్రాజెక్టు నింపి జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరిచ్చే కార్యక్రమానికి మనమంతా భాగస్వాములుగా ఉన్నామన్నారు.

ఈ పథకం ద్వారా రెండు నుండి రెండున్నర లక్షల ఎకరాల భూములకు నీరు ఇవ్వనున్నామన్నారు. దీనికి భూముల నుండి కాలువల ద్వారా కాకుండా పైపులైన్‌తో నీటి సరఫరాకు కషి చేస్తున్నామని, తద్వారా రైతుల భూములకు ఎటువంటి నష్టం వాటిల్లదని, పొలాల కోతలు పూర్తికాగానే పైపులు వేయించే కార్యక్రమాన్ని అందరం కలిసి రైతులను ఒప్పించి ఒక మిషన్‌ మోడ్‌లో పూర్తి చేయడానికి కషి చేద్దామని అన్నారు.

తద్వారా తరతరాలకు రైతులకు సాగునీరు అందే బహత్తర కార్యక్రమం మనమంతా పూర్తి చేసినట్లు అవుతుందన్నారు. ఇందులో భాగస్వాములు కావడం అదష్టంగా భావించాలని మంత్రి సూచించారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైస్‌ మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలుగజేస్తే తన దష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కాకుండా రైతులు ఎంత ధాన్యం తెచ్చినా యంత్రాంగం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

తడిసిన ధాన్యాన్ని కొనడానికి కూడా ప్రభుత్వం దష్టికి తీసుకు వెళ్తానన్నారు. అంతకు ముందు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు మాట్లాడుతూ జిల్లా రైతుల దష్టి జిల్లా పరిషత్‌ వైపు ఉన్నదని, వర్షాలు బాగా కురవడంతో ఓవైపు సంతోషంగా ఉన్నప్పటికీ వర్షాలకు కొంత పంట నష్టం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోవడానికి మంత్రివర్యులు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఇప్పటికే సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఆదేశించిన ఆయన మంత్రికి యంత్రాంగానికి కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ నెలరోజుల పల్లె ప్రగతి కార్యక్రమం ఫలితాలు మనం చూస్తున్నామని గ్రామాల్లో పారిశుద్ధ హరిత దశ్యాలు మనకు కనిపిస్తున్నాయని అన్నారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డులను రక్షణగా ఏర్పాటు చేశారని తెలిపారు.

ఆయా శాఖల చర్చల సందర్భంగా సభ్యులు లేవనెత్తిన సమస్యలపై కలెక్టర్‌ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి కలెక్టర్‌కు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు శాలువాతో సత్కారం చేశారు. సమావేశంలో గ్రామీణాభివద్ధి, గ్రామీణ నీటి సరఫరా, నీటిపారుదల, వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, విద్యుత్‌ శాఖ, పౌరసరఫరాల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలపై సభ్యులు చర్చించారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌ గుప్తా, ఎమ్మెల్సీలు విజి గౌడ్‌, రాజేశ్వరరావు, జీవన్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో గోవిందు, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌, సహకార బ్యాంక్‌ చైర్మన్‌ గంగాధర్‌ రావు పట్వారి, రెడ్‌ కో చైర్మన్‌ అలీమ్‌ పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article