Breaking News

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం పార్టీ ఆర్మూర్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం నిజాంసాగర్‌ కెనాల్‌పై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

అనంతరం సిపిఎం ఆర్మూర్‌ కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు గత 21 రోజుల నుండి సమ్మె చేస్తుంటే వాళ్ల సమస్యలు పరిష్కరించుకండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేస్తానని, ఆర్టీసీ పని అయిపోయిందని యూనియన్‌లు అవసరం లేదని మాట్లాడటం ఒక ఉద్యమ నాయకుడికి తగదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా యూనియన్‌ పెట్టి పోరాటం నడిపారని ఎద్దేవా చేశారు.

నాడు యూనియన్‌ అవసరం వచ్చింది, నేడు అధికారం రాగానే యూనియన్‌ అవసరం లేదని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆర్‌టిసి కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరలేదని రవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేయాలని అనటంలో తప్పేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రంలో ఆర్టీసీ ఎందుకు విలీనం చేయాలి అని అన్నారు.

ఒకవైపు హైకోర్టు సలహా ఇచ్చినా హైకోర్టు మాటను కూడా పట్టించుకోకుండా కోతలు కోయటం సరైంది కాదని, నీ మాటలకు కార్మికులు ఎవరు బెదరరని అన్నారు. ఇంకా ఉద్యమాన్ని ఉదృతం చేసి ముఖ్యమంత్రి మెడలు వంచే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, నాయకులు మున్నా, బి.రాజు, మధు, రాజన్న, రాజు, కుల్దీప్‌ శర్మ, ఎస్‌ఎఫ్‌ఐ నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

డబ్బుకు మోసపోయి పార్టీ ఫిరాయింపు సిగ్గుచేటు

ఆర్మూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండల‌ జడ్పిటిసి ఎర్ర యమునా ...

Comment on the article