Breaking News

Daily Archives: October 26, 2019

ఉరకలేస్తున్న గోదావరి

రెంజల్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పక్షం రోజులుగా మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. సామర్థ్యానికి మించి నీరు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు గేట్లను శుక్రవారం రాత్రి ఎత్తారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమానికి శనివారం భారీ వరద నీరు చేరుతోంది. స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు వరదను తిలకించడానికి తరలివస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బోధన్‌ ఆర్డీవో ...

Read More »

మొక్కలు నాటిన స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రీన్‌ చాలెంజ్‌లో బాగంగా శనివారం శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జె.సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ చాలెంజ్‌లో బాగంగా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మొక్కలను నాటి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన స్పీకర్‌ పోచారం అసెంబ్లీ ఆవరణలో ఆరు మొక్కలు నాటారు. అదేవిధంగా గ్రీన్‌ చాలెంజ్‌కు కొనసాగింపుగా రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ ...

Read More »

29న ‘ముచ్చట’ ఆవిష్కరణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్క తిక శాఖ సౌజన్యంతో నిజామాబాద్‌ హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్‌ 29న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ కవి ఘనపురం దేవేందర్‌ రచించిన ముచ్చట వచన కవితా సంపుటి ఆవిష్కరణ జరుగుతుందని సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కాసర్ల నరేష్‌ రావు, అధికార ప్రతినిధి నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఘనపురం దేవేందర్‌ రచించిన ఐదవ పుస్తకాన్ని ప్రఖ్యాత ...

Read More »

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

బాన్సువాడ, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాదించిన విజయానికి ప్రతీక దీపావళి అని, మనసులోని అందకారం తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేది దీపావళి పండుగ అన్నారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని స్పీకర్‌ తెలియజేశారు. నరక చతుర్దశి, దీపావళి పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్పీకర్‌ కోరారు.

Read More »

హెల్త్‌ కిట్‌ల పంపిణీ

బీర్కూర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జడ్‌పిహెచ్‌ఎస్‌ నెమలి పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన హెల్త్‌ కిట్‌లను 7వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థినిలకు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్‌.వెంకటరమణ, గ్రామ సర్పంచ్‌ పందిరి గంగామని భూమేశ్‌ చేతుల మీదుగా హెల్త్‌ కిట్‌లను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాంరెడ్డి, ఉపాధ్యాయులు వినోద, రమణ పాల్గొన్నారు.

Read More »

అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నానని, ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. నరక చతుర్దశి, దీపావళిని పురస్కరించుకుని ప్రజలందరూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా పండుగను జరుపుకోవాలని, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో దీపావళి లాగే అందరి హదయాల్లో, మనసుల్లో ఆనంద కాంతులు వెలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జిల్లాలో సగటుకు మించి వర్షాలు కురిసినందున జిల్లా ...

Read More »

ఆరోగ్యం పట్ల అశ్రద్ద వహించరాదు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శనివారం నిజామాబాదు నగరంలోని ఎస్సీ బాలికల వసతిగహంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్‌ అంకం భానుప్రియ కార్యక్రమానికి అతిధిగా హాజరై ప్రసంగించారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ద వహించరాదన్నారు. రక్తహీనత సమస్యను అధిగమించేందుకు పండ్లు, బెల్లంతో తయారు చేసే పల్లిపట్టీలు వంటి వాటితో పాటు పాలు తీసుకోవాలన్నారు. యోగా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో ...

Read More »