Breaking News

Daily Archives: October 29, 2019

గోదావరిని పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌

రెంజల్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం రోజులుగా మహారాష్ట్ర ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరదనీరు భారీగా చేరడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టులు గైక్వాడ్‌, విష్ణుపురి గేట్లను విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న గోదావరి నది కొత్త కల సంతరించుకుంది. మంగళవారం కందకుర్తి గోదావరినది నీటి ప్రవాహాన్ని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, బోధన్‌ ఆర్డీవోతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోదావరికి వరద ఉద్ధతి భారీగా రావడంతో దిగువ భాగాన ఉన్న గ్రామాల ప్రజలు ...

Read More »

దండిగుట్టలో ఉచిత వైద్య శిబిరం

రెంజల్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం దండిగుట్ట గ్రామంలో మంగళవారం నిజామాబాద్‌ మండలం మల్లారం గ్రామంలోని మేఘన డెంటల్‌ కాలేజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దండిగుట్ట గ్రామంలో ఉచిత దంత శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. దంత వైద్యులు రాజ్‌ భూషణ్‌, సంధ్యారెడ్డి, అపూర్వ, సారాలు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ...

Read More »

ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బోధన్‌ మండలం కల్దుర్తి, ఖండ్‌గాం గ్రామాల్లో ఇసుకరిచ్‌ల ఏర్పాటుకు కమిటీ ఆమోదించారు. కోటగిరి మండలం కోడిచెర్ల ఇసుక రీచ్‌ 1, 2 ఏర్పాటుకు ఐడిసి అధికారులు ఆక్షేపణ తెలిపినందున తిరిగి ఇన్ప్లేన్స్‌ జోన్‌ రూల్స్‌ ప్రకారంగా ...

Read More »

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాన్సువాడ నుండి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప దీక్ష స్వాముల బందానికి జండా ఊపి స్పీకర్‌ ప్రారంభించారు.

Read More »

దయాకర్‌రెడ్డిని పరామర్శించిన షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దయాకర్‌ రెడ్డి అనారోగ్యంతో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మంగళవారం మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దయాకర్‌ రెడ్డిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.

Read More »

మున్సిపల్‌ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చేలోపు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కలెక్టర్లను, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాదు నుండి ఎన్నికలకు సంసిద్ధత కావడంపై కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గౌరవనీయ హై కోర్ట్‌ క్లారిటీ ఇచ్చినందున అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఇందులో ముఖ్యంగా ఓటర్ల జాబితా, ...

Read More »

వయోవద్ధులకు ప్రత్యేక ఓపి కేంద్రం, ఆశ్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయోవద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఓపి కేంద్రం, డిచ్‌పల్లిలో ఆశ్రమం ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రపంచ వయోవద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి శ్రీ సుధతో కలిసి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సమాజంలో ఏర్పడుతున్న విపరీత పోకడల వల్లనే నేడు ...

Read More »

వరద గేట్ల ఎత్తివేత

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కళ్యాణి ప్రాజెక్టులోకి 4448 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద నీరు రావడంతో 7 గేట్ల ద్వారా 3982 క్యూసెక్కుల వరద నీరు మంజీరాలోకి, నిజాంసాగర్‌ ప్రాజెక్టు మెయిన్‌ కెనాల్‌లోకి 446 క్యూసెక్కుల వరద నీరు మళ్ళించడం జరిగిందని ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్టుకు వరద రావడంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రధాన కాలువలోకి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ...

Read More »

బంగారు బాన్సువాడగా తీర్చిదిద్దుతాం

బాన్సువాడ, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఎన్‌జివోస్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, సింధి గల్లీ, జెండా గల్లీ, బండ గల్లీలలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో జరుగుతున్న అభివద్ధి పనులను పరిశీలించి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచనలను చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో ప్రస్తుతం నివసిస్తున్న జనాభా 40,000 అదేవిధంగా ప్రతిరోజూ బాన్సువాడ పట్టణానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వారు 20,000 మంది ...

Read More »

ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై నగర ప్రజలకు అవగాహన

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ కార్యక్రమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం ఖిల్లా వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఖిల్లా వీధులలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్లాస్టిక్‌ వాడవద్దనీ, చెత్తను ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ వారికి అందచేయాలని కోరుతూ, వారికి జనపనార సంచులను పంపిణీ ...

Read More »

మద్దికాయల ఓంకార్‌ ఆశయ సాధనకు పోరాటాలు నిర్వహిస్తాం

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామ్రేడ్‌ మద్దికాయల ఓంకార్‌ 11వ వర్ధంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఎంసిపిఐ పార్టీ రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఓంకార్‌ తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ అగ్రకుల పేదలే కార్మిక వర్గంలో ఉన్నారని కార్మిక వర్గం రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కామారెడ్డి జిల్లా ఎంసిపిఐ పార్టీ కషి చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ...

Read More »

ద్విచక్ర వాహనం దగ్దం

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం శాబ్దిపుర్‌ గ్రామంలో కుంట శ్రీనివాస్‌కు చెందిన ద్విచక్ర వాహనం దగ్దమైంది. శ్రీనివాస్‌ తన ఇంటి ముందు పార్కింగ్‌ చేసి ఉన్న ఏపి 29 బిఎన్‌ 6493 నెంబర్‌గల ద్విచ్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారని చెప్పారు. దేవుని పల్లి పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు అన్నారు.

Read More »