Breaking News

Daily Archives: October 30, 2019

ధ్వజస్తంభ పున: ప్రతిష్ట

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలోని రామాలయంలో ధ్వజ స్థంబ పునప్రతిష్ట కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఆలయంలోని పురాతన ధ్వజస్థంభం నేలకొరగడంతో నూతన ధ్వజస్తంబాన్ని పునప్రతిష్టించారు. ఆలయకమిటి ఆధ్వర్యంలో వేద పండితులు జపాల భాస్కర శర్మ హోమము జరిపించారు. కార్యక్రమంలో ఎంపిపి దొడ్ల నీరజ, వెంకట్‌ రాం రెడ్డి దంపతులు, గ్రామపెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read More »

నవంబర్‌ 3న దయానంద సరస్వతి బలిదాన దినోత్సవం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యసమాజము-ఇందూరు ఆధ్వర్యంలో మహర్షి దయానంద సరస్వతి బలిదాన దినోత్సవము నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నవంబర్‌ 3వ తేదీ ఆదివారం కార్తీక శుక్ల సప్తమి రోజున సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 7.30 వరకు ఆర్యసమాజ వైదిక సత్సంగ భవనంలో కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. సమాజ సభ్యులు, అభిమానులు హాజరుకావాలని కోరారు.

Read More »

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. ఆర్మూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో డివిజన్‌ రెవెన్యూ శాఖ ధాన్యం కొనుగోలు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సమీక్ష సమావేశం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంద రోజుల్లో పూర్తిచేయాలని నిర్దేశించినందున వందకు వందశాతం రికార్డుల ప్రక్షాళన సంపూర్ణంగా పూర్తిచేయాలని, గతంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశాలు ...

Read More »

అసమానతలు లేకుండా కలిసికట్టుగా ఉండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ ప్రజలు ఏలాంటి అసమానతలు లేకుండా కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివద్ధి దిశలో ముందుకు తీసుకుపోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆన్నారు. ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో రెవెన్యూ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా గ్రామాభివద్ధికి ప్రణాళికలు చేసుకొని ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టాలన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఏలాంటి ...

Read More »

అట్రాసిటీ కేసు నమోదు

రెంజల్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాటాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ రవిపై దాడికి పాల్పడిన సంఘటన స్థలాన్ని బోధన్‌ ఏసీపీ రఘు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే సాటాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ రవిపై అదే గ్రామానికి చెందిన అమనుల్లా అనే వ్యక్తితోపాటు పలువురు దాడి చేసిన సంఘటనపై విచారణ చేపట్టారు. గత నెల రోజుల క్రితం జాదవ్‌ రవి వద్ద 6 వేల రూపాయలను అమాన్‌ తీసుకోగా, వాటిని తిరిగి ఇవ్వమని అమాన్‌ ఇంటికి వెళ్లిన రవిపై దాడితో ...

Read More »

కూనేపల్లిలో సివిల్‌ రైట్స్‌ దినోత్సవం

రెంజల్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి గ్రామంలో సివిల్‌ రైట్స్‌ దినోత్సవాన్ని తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి చైతన్యవంతులను చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయ, ఆర్‌ఐ గంగాధర్‌, వైద్యాధికారి క్రిస్టినా, నాయకులు లింగం, సాయిలు, తదితరులు ఉన్నారు.

Read More »

శాసనసభ సభ్యునిగా సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యునిగా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సైదిరెడ్డితో అసెంబ్లీ లోని తన చాంబర్‌లో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ ఉప సభాపతి టి. పద్మారావు గౌడ్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మంత్రులు మహముద్‌ మహ్మద్‌ ఆలీ, గుంతకండ్ల జగదీశ్వర్‌ రెడ్డి, ...

Read More »

ప్రయాణీకులకు మౌలిక వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ ఫారం నంబర్‌ 4, 5 లో ఆగే గూడ్స్‌ రైళ్లను జానకంపేట్‌ స్టేషన్‌కు తరలించి, ఆ స్థానంలో ప్యాసింజర్‌ రైళ్లు ఆగేలా చూడాలని నిజామాబాద్‌ ఎంపి అర్వింద్‌ రైల్వే అధికారులకు సూచించారు. అలా చేయడం ద్వారా ప్రస్తుతమున్న టెంపరరీ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని అన్నారు. ఈ మేరకు ఎంపి అర్వింద్‌ బుధవారం నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. 2, 3 ప్లాట్‌ ...

Read More »

పచ్చని ఠాణ

నందిపేట్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ఠాణను నందనవనంగా మార్చారు పోలీసులు. సాధారణంగా ఠాణాకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతారు, కానీ నందిపేట్‌ పోలిస్‌ ఠాణ అందుకు భిన్నంగా ఠాణకు వచ్చేవారికి ఆహ్లాదం పంచుతుంది. పోలీస్‌ ఠాణలో వివిధ రకాల మొక్కల పెంపకంతో పాటు నీడనిచ్చే చెట్లు, వివిధ రకాల పూల మొక్కలు దర్శనమిస్తాయి. చెట్లు ఏపుగా పెరగడంతో అన్ని కాలాల్లో పచ్చగా దర్శనమిస్తుంది. దాంతోపాటు తీగ జాతి మొక్కలను నాటి వాటిని అందంగా తీర్చిదిద్దారు. స్టేషన్‌ లోపల జామ, ...

Read More »