Breaking News

అసమానతలు లేకుండా కలిసికట్టుగా ఉండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ ప్రజలు ఏలాంటి అసమానతలు లేకుండా కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివద్ధి దిశలో ముందుకు తీసుకుపోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆన్నారు. ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో రెవెన్యూ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా గ్రామాభివద్ధికి ప్రణాళికలు చేసుకొని ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టాలన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఏలాంటి అట్రాసిటీ నమోదు కాలేదని అలాంటి అవకాశమే ఈ గ్రామంలో లేదన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే పౌర హక్కుల చట్టం ఎస్‌టి, ఎస్‌సి నిరోధక చట్టం ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేసేది లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ఆసరా పెన్షన్‌లు, డ్వాక్రా గ్రూపులకు రుణాల పంపిణీ, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖల ద్వారా రుణాలు అందించి సామాజిక ప్రగతికి దోహద పడే విధంగా ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందని, 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో అధికారులు ప్రజా ప్రతినిధులు సహకారంతో విజయవంతమైనట్లు, గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని చెప్పారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే సీజనల్‌ వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు రావని చెప్పారు. మహారాష్ట్ర నుండి గోదావరి నదికి నీటి విడుదల చేస్తున్నందున గోదావరి వరద ఉధతి పెరిగిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మత్స్యకారులు పశువుల కాపర్లు, యువకులు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.

తదనంతర గ్రామంలో చేపట్టిన పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. మురుగు కాలువలు రోడ్డుపై నీటిని వెంటనే తొలగించాలన్నారు. గోదావరి నది వరద ఉదతిని పరిశీలించారు. పురాతనమైన దేవాలయానికి భక్తులు వచ్చిన సందర్భంగా గోదావరి నది నీటి ప్రవాహం ఎక్కువగా వస్తున్న దష్ట్యా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తతతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు భూమన్న, రాజ గంగారాం, తహసిల్దార్‌, గ్రామ సర్పంచ్‌, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. వైద్యాధికారులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాని పక్షంలో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఎర్రగుంట్ల మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనికీ చేశారు.

ఆస్పత్రిలో మందులు, అవుట్‌ పేషంట్‌ సిబ్బంది హాజరుపై జిల్లా కలెక్టర్‌ వైద్య అధికారిని అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారితో పాటు వైద్య సిబ్బంది సకాలంలో హాజరుకావాలని రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించి చికిత్స చేయాలని అన్నారు.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article