Breaking News

ప్రయాణీకులకు మౌలిక వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ ఫారం నంబర్‌ 4, 5 లో ఆగే గూడ్స్‌ రైళ్లను జానకంపేట్‌ స్టేషన్‌కు తరలించి, ఆ స్థానంలో ప్యాసింజర్‌ రైళ్లు ఆగేలా చూడాలని నిజామాబాద్‌ ఎంపి అర్వింద్‌ రైల్వే అధికారులకు సూచించారు. అలా చేయడం ద్వారా ప్రస్తుతమున్న టెంపరరీ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని అన్నారు.

ఈ మేరకు ఎంపి అర్వింద్‌ బుధవారం నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. 2, 3 ప్లాట్‌ ఫారాల్లో త్రాగునీటి వసతిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రయాణికుల కొరకు వెంటనే ఒక ఫుడ్‌ ప్లాజా ఏర్పాటు చేయాలని, స్టేషన్లో ఉన్న నల్లాలోనుండి మంచినీటిని స్వయంగా తాగి, అక్కడి దురవస్థను చూసి, మెయింటెనెన్స్‌ కాంట్రాక్టర్‌ని మందలించారు. వికలాంగుల కోసం కూడా మంచినీటి వ్యవస్థని ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు.

స్టేషన్లో ఎస్కలేటర్‌ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన క్రితం సారి జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో ప్రతిపాదించామని, ముఖ్యంగా స్టేషన్లో ఉన్న త్రాగునీరు, టాయిలెట్ల పరిస్థితిని మెరుగు పరచాల్సిన అవసరం చాలా ఉందని అధికారులను మందలించారు. ఎంపి వెంట పలువురు నాయకులు, అధికారులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article