Breaking News

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. ఆర్మూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో డివిజన్‌ రెవెన్యూ శాఖ ధాన్యం కొనుగోలు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సమీక్ష సమావేశం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంద రోజుల్లో పూర్తిచేయాలని నిర్దేశించినందున వందకు వందశాతం రికార్డుల ప్రక్షాళన సంపూర్ణంగా పూర్తిచేయాలని, గతంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశాలు ద్వారా ఆదేశించినప్పటికీ ఇంకా పూర్తి చేయకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని, ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఫిర్యాదులు వచ్చిన పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వ భూములకు సర్వే చేసి నిర్ధారించారని భూ బ్యాంక్‌ ఏర్పాటు చేసి అవసరమైన సందర్భంలో కేటాయించే విధంగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ అవసరాల కోసం స్థల సేకరణకు సిఫార్సు చేసినప్పుడు ఎలాంటి పరిశీలన చేయకుండానే స్థలం లేదని నివేదిస్తున్నారని, డంపింగ్‌ యార్డ్‌ వైకుంఠ ధామాలకు స్థలం ఎంతో అవసరముందని చెప్పారు. అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్‌ వదిలి వెళ్లకూడదని వెళ్లిన పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లాలో అకాల వర్షాలకు నష్టం వాటిల్లుతుందని వాటి వివరాలను ముందస్తుగా అందచేయాలని వర్షాల వలన ప్రాణ, ఆస్తి, పశు, పంట నష్టాలు జరిగినప్పుడు సంబంధిత శాఖ అధికారులతో జాయింట్‌గా విచారణ చేసి నివేదించాలని ఆదేశించారు. గోదావరి నది వరద ఉద్ధతి ఎక్కువగా ప్రవహిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, విఆర్‌ఓ నుండి తహసిల్దార్‌ వరకు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, గన్ని బ్యాగులు రవాణా చెల్లింపులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎక్కువ వర్షాభావ పరిస్థితుల వలన పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశముందని ముందు గ్రహించి అవసరం మేరకు 310 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రెవెన్యూ వ్యవసాయ శాఖ సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా చేసేందుకు కషిచేయాలని జేసీ అన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, జిల్లాలో అర్హులైన వారికి పాస్‌ పుస్తకాలు అందజేయాలని అన్నారు.

ఏవైనా అనుమానాలుంటే క్షేత్ర పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్వోలు తమ బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలని అవినీతి అక్రమాలకు పాటు పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ శ్రీనివాస్‌, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ ...

Comment on the article