Breaking News

Daily Archives: November 4, 2019

పేకాటరాయుళ్ళ అరెస్టు

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు పేకాటరాయుళ్లను అరెస్టుచేసినట్టు దేవునిపల్లి ఎస్‌ఐ తెలిపారు. గోస్‌కె రాజయ్య కాలనీలో పిచ్చిరెడ్డి కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్న విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తమ సిబ్బందితో దాడిచేశారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను, రూ. లక్ష 54 వేల 260 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడుతున్న వారు కామారెడ్డి వాసులుగా పేర్కొన్నారు.

Read More »

ఆర్మూర్‌ ఏసిపిగా రఘు

ఆర్మూర్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన ఏసిపిగా ఆర్మూర్‌కు విచ్చేసిన ఏసిపి రఘుకి సోమవారం స్వాగతం పలికారు. ఆర్మూర్‌ ఎంపిపి పస్క నర్సయ్య, సర్పంచ్‌ల ఫోరమ్‌ అధ్యక్షులు లింబారెడ్డి, ఎంపీటీసీ ఫోరమ్‌ అధ్యక్షులు ఎంసీ గంగారెడ్డి, ఆర్మూర్‌ మండల వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఏసిపిని కలిసి పుష్పగుచ్చం అందించారు.

Read More »

రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి

ఆర్మూర్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండల తహసిల్దార్‌ విజయపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపిన ఘటనకి నిరసనగా సోమవారం ఆర్మూర్‌ తహసీల్‌ కార్యాలయ ఆవరణలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి విధులు బహిష్కరించారు. ఈ ఉదంతానికి పాల్పడిన దుండగుడిని కఠిÄనంగా శిక్షించి రెవిన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిందిగా ఆర్మూర్‌ తహసిల్‌ కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Read More »

3వ రోజు బిజెపి పాదయాత్ర

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సమస్యలపై బీజేపీ చేపట్టిన పాదయాత్ర 3 వ రోజు కాటిపల్లి రమణా రెడ్డి నాయకత్వంలో కామారెడ్డి పట్టణంలోని 13వ వార్డు నుండి 29వ వార్డు వరకు అన్ని కాలనీలలో చేపట్టారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలు డ్రైనేజి వ్యవస్థ సరిగా లేక పోవటంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొన్ని కాలనీల్లో పారిశుధ్య కార్మికులు అసలు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. డైలీ ...

Read More »

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన

ఆర్మూర్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం రంగారెడ్డి జిల్లా ఉద్యోగిని విజయపై నిప్పంటించి దహనం చేసిన చర్యను నిరసిస్తూ వేల్పూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిని వదలకుండా శిక్షపడేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

Read More »

కోర్టు కేసులు, ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా శాఖలకు సంబంధించి కోర్టు కేసుల వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని, ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పలు విషయాలపై ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల వివరాలను దానికి సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌కు తెలియచేయాలని, పేరా వైజ్‌ వివరాలు ...

Read More »

జిల్లా కేంద్రంలో కాల్‌సెంటర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పెన్షన్‌ లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్‌ అవగాహన కల్పించేందుకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసరా పెన్షన్‌ లబ్ధిదారులు జిల్లా కేంద్రానికి రాకుండానే కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే స్వీకరించి పరిష్కారం చేస్తారని చెప్పారు. కాల్‌ సెంటర్‌లో లబ్ధిదారులు ఫోన్‌ చేసిన పక్షంలో వెంటనే వినతిని నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ...

Read More »

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యార్థి

రెంజల్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల పరిదిలోని మైనార్టీ రెసిడెన్సియల్‌ పాఠశాల విద్యార్థిని సఫియా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయమ ఉపాద్యాయురాలు భాగ్యశ్రీ తెలిపారు. ఆదివారం కామారెడ్డి జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చడంతో రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలకు ఏంపిక చేశారన్నారు. మంగళవారం జనగామలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడీ పోటీలలో పాల్గోనేందుకు పంపించడం జరుగుతుందని పేర్కోన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థిని సఫియా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనందుకు విద్యార్థిని ...

Read More »

యువతి అదశ్యం

రెంజల్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన పత్రి ఇందిరా అనే యువతి గత నెల 31 వతేదీన అదశ్యమైనట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. యువతి జిల్లా కేంద్రంలోని నిశిత డిగ్రీ కళాశాలలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతుంది. రోజు మాదిరిగా ఉదయం కాలేజీకి బయలుదేరిన యువతి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తెలిసిన బంధువుల ఇళ్ళల్లో గాలించినా ఎటువంటి సమాచారం అందకపోవడంతో యువతి తండ్రి పత్రి పెద్ద సాయిలు పిర్యాదు మేరకు కేసు నమోదు ...

Read More »

అంచెలంచెలుగా యూజీడీ పనులు అందుబాటులోకి

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో కొనసాగుతున్న యూజీడీ పనులు అంచెలంచెలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నారని నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా తెలిపారు. సోమవారం ఎల్లమ్మ గుట్ట వద్ద నిర్మాణం పనులు పూర్తిచేసుకున్న రెండవ మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 నెలల క్రితం 31.5 ఎంఎల్‌డి కెపాసిటీ కలిగిన ఎస్‌.టి.పి.ని మంత్రిగారు ప్రారంభించిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. అదేవిధంగా ఈరోజు 15 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి ...

Read More »

రైతులు దళారులను ఆశ్రయించవద్దు

రెంజల్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజినీ అన్నారు. సోమవారం మండలంలోని దండిగుట్ట గ్రామంలో జడ్పీటీసీ మేక విజయ, సర్పంచ్‌ శ్రీదేవితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు కష్టపడి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అన్నారు. ప్రభుత్వం ...

Read More »

5న దిశ సమీక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దిశ (జిల్లా అభివద్ధి సమన్వయ మరియు మానిటరింగ్‌ కమిటీ) సమీక్ష సమావేశం ఈనెల 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు అరవింద్‌ ధర్మపురి అధ్యక్షతన జరిగే సమావేశానికి కమిటీ సభ్యులు సంబంధిత శాఖ అధికారులు సకాలంలో హాజరుకావాలని డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »