Breaking News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యార్థి

రెంజల్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల పరిదిలోని మైనార్టీ రెసిడెన్సియల్‌ పాఠశాల విద్యార్థిని సఫియా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయమ ఉపాద్యాయురాలు భాగ్యశ్రీ తెలిపారు.

ఆదివారం కామారెడ్డి జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చడంతో రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలకు ఏంపిక చేశారన్నారు. మంగళవారం జనగామలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడీ పోటీలలో పాల్గోనేందుకు పంపించడం జరుగుతుందని పేర్కోన్నారు.

మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థిని సఫియా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనందుకు విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్‌, వార్డెన్‌, ఉపాద్యాయులు అభినందించారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *