Breaking News

Daily Archives: November 6, 2019

8న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మాజీ మంత్రి వర్యులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో షబ్బీర్‌ అలీ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ సిడిసి అధ్యక్షులు కారంగుల అశోక్‌ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం (బిజెపి) అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8 వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ...

Read More »

విలీన గ్రామాల సమస్యలు తెలుసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ సమస్యలపై బీజేపీ చేపట్టిన పాదయాత్ర 5 వ రోజు కాటిపల్లి రమణా రెడ్డి నాయకత్వంలో టెక్కిరియల్‌, అడ్లూరు గ్రామాల్లో చేపట్టారు. ఈ సంధర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. మున్సిపల్‌లో కలిసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికి ప్రజాప్రతినిధులు లేకపోవటంతో ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ...

Read More »

పాఠశాల తనిఖీ

నిజాంసాగర్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం నడిమి తండా, కోనా తండా, ప్రాథమికోన్నత పాఠశాల, గాలిపూర్‌, ముగ్దుమ్‌పూర్‌ పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన ఎలా చేస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని ఎంఈఓ అడిగి తెలుసుకున్నారు. వారానికి ఒకసారి గుడ్డు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ...

Read More »

మీసేవా కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుళ్లబాద్‌ మండలం బొమ్మనదేవపల్లి గ్రామంలో ”దుర్గా ఆన్‌ లైన్‌ మీసేవ” కేంద్రాన్ని దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షులు, తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నసురుళ్లబాద్‌ ఎంపీపీ విట్టల్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, లక్ష్మి నారాయణ, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీ సేవ నిర్వాహకులు దుర్గాసింగ్‌ పాల్గొన్నారు.

Read More »

విఆర్‌ఏల బైక్‌ ర్యాలీ

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో తహసిల్దార్‌ విజయా రెడ్డి సజీవదహనంపై స్పందించి బుధవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు, విఆర్‌ఏలు రాజు, దుర్గాప్రసాద్‌ మాట్లాడారు. మండల మెజిస్ట్రేట్‌ తహసిల్దార్‌ విజయ రెడ్డి దారుణ హత్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, మండల మెజిస్ట్రేట్‌ పైనే ఇలాంటి దాడులు జరిగితే తమ లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల మాట ఏంటని ప్రశ్నించారు. తాము పనులు చేయాలా వద్దా, పనులు చేసిన బాధనే, చేయకుంటే ...

Read More »

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్న గుట్ట తండా గ్రామానికి చెందిన హర్ష (3) అనే చిన్నారి ప్రమాదవశాత్తు ఇంట్లోని టీవీ బాలుడిపై పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. కాగా జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మతి చెందినట్లు ఎస్సై తెలిపారు. చిన్నారి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read More »

చెరువులో పడి యువకుడు మతి

బాన్సువాడ, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన పల్లపు రాజు (30) అనే వ్యక్తి స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం ..కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన రాజు స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మతదేహాన్ని జాలర్ల సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మతుడికి భార్య భూలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు ...

Read More »

మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన

బాన్సువాడ, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధి లోని కల్కి చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ అభివద్ధి పనులను దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షులు, తెరాస రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, సర్పంచ్‌లు శ్రావణ్‌, నారాయణ రెడ్డి, రఘు, నాయకులు వెంకట్‌ రాంరెడ్డి, ఎజాజ్‌, భాస్కర్‌, పాతబాలు, ప్రవీణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం దేశాయిపేట్‌ సొసైటీ పరిధిలోని సోమేశ్వర్‌ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు, తెరాస రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, సోమేశ్వర్‌, సర్పంచ్‌ పద్మ మొగులయ్య, ఎంపీటీసీ రమణ, సర్పంచ్‌లు శ్రావణ్‌, నారాయణ రెడ్డి, నాయకులు వెంకట్‌ రాంరెడ్డి, ఎజాజ్‌, భాస్కర్‌, పాతబాలు, ప్రవీణ్‌ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మొగులయ్య, రాజిరెడ్డి ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Read More »