Breaking News

Daily Archives: November 10, 2019

పలుగ్గుట్ట జాతరకు ఏర్పాట్లు పూర్తి

నందిపేట్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ నిర్వాహకులు మంగిరాములు మహారాజ్‌ గత 36 దినాలుగా గర్భగుడిలో దీక్షలో ఉన్నారు. కాగా సోమవారం రాత్రి దీక్ష విరమింప చేయనున్నారు. ఈ సందర్భంగా జాతర, అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్‌ సందేశం ఇవ్వడానికి వేదిక ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 40 నుండి 50 వేల మందికి అన్నదానం కొరకు పదార్థాలు సమకూర్చారు. సేవ చేయడానికి విద్యార్థులను, వాలంటీర్లను నియమించారు. ...

Read More »

ప్రాణాలు పోతేనే స్పందించిన అధికారులు

నందిపేట్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం వాహనదారుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రోడ్లు రైతుల కల్లాలుగా మారాయి. రోడ్లపైనే ధాన్యం కుప్పలు వేయడం వలన వాహనదారులకు ప్రాణహాని ఉందని పత్రికలలో ఎన్నో కథనాలు వచ్చాయి. అయినా అధికారులు స్పందించలేదు. నందిపేట్‌ మండలంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వలన మేల్కొన్నారు. ధాన్యం కుప్పల మూలంగా రెండు నిండు ప్రాణాలు పోయిన తర్వాత ఇట్టి సమస్యపై జిల్లావ్యాప్తంగా అధికారులు దష్టి కేంద్రీకరించి రోడ్లపై ధాన్యాలు ఆరబెట్టిన వారిపై చట్టపర చర్యలు ప్రారంభించారు. ...

Read More »

పాల క్యాన్లు పంపిణీ

నిజాంసాగర్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తిమ్మా నగర్‌ గ్రామంలో హెరిటేజ్‌ పాడి రైతులకు పాల క్యాన్లను అందజేశారు. కార్యక్రమంలో హెరిటేజ్‌ పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్‌ ఆర్‌. సాయిలు పాల నాణ్యత గూర్చి పాడి రైతులకు విపులంగా వివరించారు. పాలలో పోషకపదార్థాలు మెండుగా ఉన్నప్పటికీ అవి చాలా త్వరగా చెడిపోయే స్వభావం కలిగి ఉంటాయని, బ్యాక్టీరియా వద్ధికి అనుకూలంగా ఉంటాయన్నారు. వివిధ కారణాలవల్ల పాలు కలుషితమవడం వల్ల త్వరగా పులిసి పోతాయి చెడిపోతాయన,ఇ అపరిశుభ్రమైన కల్పితమైన పాల వల్ల ...

Read More »

సోమవారం ఆశ్రమ పాఠశాల భవన ప్రారంభోత్సవం

బాన్సువాడ, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీ సోమవారం కామారెడ్డి జిల్లా నసురల్లాబాద్‌ మండల కేంద్రంలో రూ. 4.20 కోట్లతో నిర్మించిన ఎస్‌టి గురుకుల ఆశ్రమ పాఠశాల నూతన భవనాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుందని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Read More »

కోటగిరిలో ఉచిత వైద్య శిబిరం

బాన్సువాడ, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్‌ పట్టణ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ వైద్య బందం అంకం ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి ...

Read More »

డిసెంబరు 1న బిసి యువజన రాష్ట్ర మహాసభ

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ ఒకటిన హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బిసి యువజన సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం మహాసభ కరపత్రాలను నిజామాబాద్‌ వంశీ ఇంటర్నేషనల్‌ హోటల్లో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్‌ నంద, బిసి సంక్షేమ సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్ష నరాల సుధాకర్‌ విడుదల చేశారు. బీసీ యువత తమను ...

Read More »

ఘనంగా ఈద్‌ మిలాదున్‌ నబీ వేడుకలు

నందిపేట్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో మిలాదున్‌ నబీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బర్కత్‌ పురలోని ఇబ్రహీం మస్జిద్‌ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా వెళ్లి మజీద్‌ రహమనియా వద్ద విరమింపజేశారు. జెండాలు చేతబట్టి, ముస్లింలు ఘనంగా ర్యాలీ నిర్వహిస్తూ.. నినాదాలతో హోరెత్తించారు. ఇస్లాం మత స్థాపకుడు మహా ప్రవక్త ముహమ్మద్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ముస్లింలు పండుగను జరుపుకుంటారని ముస్లిం పెద్దలు తెలిపారు. మానవ మహోపకారి ముహమ్మద్‌ సల్లల్లాహు ...

Read More »

ముదిరాజ్‌ సంఘం జిల్లా కార్యదర్శిగా మద్దుల మురళి

నందిపేట్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం తొండకూర్‌ గ్రామానికి చెందిన మద్దుల మురళి ముదిరాజ్‌ సంఘం జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ చేతుల మీదుగా నియామక పత్రం జిల్లా కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Read More »