Breaking News

Daily Archives: November 11, 2019

పకడ్బందీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుండి పౌరసరఫరాల శాఖామాత్యులు కమలాకర్‌, వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్‌ రెడ్డిలు ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివరిస్తూ వర్షాలు సమద్ధిగా పడినందున, రైతుబంధు, రైతు బీమా వల్ల జిల్లాలో 40 శాతం అదనంగా వరి సాగు జరిగిందని తెలిపారు. తద్వారా గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు ...

Read More »

విద్యారంగానికి పెద్దపీట

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలకు నిజమైన ఆస్తి, సంపద వారి కన్నబిడ్డలు బాగా చదివి ఉన్నతంగా ఎదిగినప్పుడేనని, దానిని దష్టిలో ఉంచుకొనే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో దాదాపు 5 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన బాలుర గురుకుల విద్యాలయాన్ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి ...

Read More »

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్మూర్‌ ఆర్‌డివో శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆర్మూర్‌ జ్యోతిబాఫూలే తెలంగాణ బిసి బాలికల వసతి గృహ పాఠశాలలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలానా అబుల్‌ కలాం జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిసి వసతి గృహాలను ఏర్పాటుచేసి ప్రయివేటుకు ధీటుగా ...

Read More »

సృజనాత్మకతకు పుస్తకాలు దోహదపడతాయి

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా సజనాత్మకతను, సామాజికాంశాలపై అవాగాహన పెంచుకునేందుకు ఇతర పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని జడ్‌పీ వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌ అన్నారు. బోధన్‌ పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే పాఠశాలలో సోమవారం మౌలానా అబుల్‌ కలాం జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించారు. కాగా ప్రదర్శనను రజిత ఎల్లయ్య యాదవ్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ...

Read More »

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పాత బాన్సువాడలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించనున్న 76 రెండు పడక గదుల ఇళ్ళకు సోమవారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, పేదవారి ఆత్మగౌరవం కాపాడటానికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టిందన్నారు. అన్ని వసతులతో పట్టణాలలో రూ.5.30 లక్షలతో ఇంటి నిర్మాణం చేపడుతున్నామన్నారు.

Read More »

గ్రంథాలయం ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుళ్లబాద్‌ మండలం మైలారం గ్రామంలో గ్రామ పెద్దలు, యువకులు ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని దేశాయిపెట్‌ పిఏసిఎస్‌ అధ్యక్షులు, టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌, నసురుళ్లబాద్‌ మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు మజిద్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More »