Daily Archives: November 13, 2019

రూ. 35 వేలు ఆర్థిక సహాయం

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయరెడ్డి తహసీల్దార్‌ దారుణ హత్య సమయంలో కాపాడబోయి మరణించిన కారు డ్రైవర్‌ గురునాథం కుటుంబానికి, గాయపడిన అటెండర్‌, రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ అండ్‌ సివిల్‌ సప్లైలోని రెవిన్యూ సిబ్బంది రూ. 35 వేలు ఆర్థిక సహాయాన్ని బుధవారం కామారెడ్డి జిల్లా సెక్రెటరీ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ శ్రీనివాస్‌కు జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ మొత్తానికి ఇంకా జిల్లాలోని ఇతర మండలం నుండి అందిన మొత్తాన్ని ...

Read More »

రక్తదానం చేసిన మండల వ్యవసాయ విస్తరణ అధికారి

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌కి చెందిన కవితకు గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వహకుడు బాలును సంప్రదించారు. దీంతో వారు కామారెడ్డి మండల వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్‌ రెడ్డి సహకారంతో బుధవారం ఉదయం విటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ గడచిన 15 సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లాతో పాటు ...

Read More »

చదువుతోపాటు క్రీడలు అవసరం

రెంజల్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యవసరమని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ బలరాం అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అండర్‌- 15 బాల బాలికల వాలీబాల్‌ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయని, క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి జ్ఞాపకశక్తి ఏకాగ్రత ల పెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ...

Read More »

నీటి వధా నిరోధించండి

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి ఘోషతో ఒక పక్క ప్రజలు అల్లాడుతుంటే నందిపేట్‌ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వలన త్రాగునీటి కులాయిల నుండి నీరు వధాగా వెళుతుంది. దాంతో లక్షలు ఖర్చుపెట్టి మరమ్మతు చేస్తున్న రోడ్డు మొరం కొట్టుకుపోయి రోడ్డు అంతా బురదమయం అవుతుంది. నిజామాబాద్‌ కు పోయే మెయిన్‌ రోడ్‌లో తిరుమల ఆటోమొబైల్‌ ప్రక్కన గల కాలనీలో కులాయి ఉదయం 11 గంటల వరకు వధాగా పారుతుంది. అదేవిధంగా చాకలి ఐలమ్మ ...

Read More »

జనరల్‌ ఫంక్షన్‌ హాల్‌ భవనానికి భూమి పూజ

బీర్కూర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని హాజీపూర్‌ గ్రామంలో బుధవారం రూ. 25 లక్షలతో నిర్మించనున్న జనరల్‌ ఫంక్షన్‌ హాల్‌కు జడ్పిటిసి జన్నుబాయి ప్రతాప్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జన్నుబాయి మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చలువతో గ్రామ ప్రజలకు ఫంక్షన్‌ హాల్‌ మంజూరైందన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డితోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంజయ్య, ఉపసర్పంచ్‌ విఠల్‌, మాజీ జడ్పిటిసి విఠల్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

అక్రమంగా తరలిస్తున్న ధాన్యం పట్టివేత

రెంజల్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కందకుర్తి వద్ద వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద మహారాష్ట్ర నుండి తరలిస్తున్న అక్రమ వరి ధాన్యం లారీని పట్టుకున్నట్లు ఎన్‌ఫోర్సుమెంట్‌ డిటి వసంత తెలిపారు.

Read More »

ఆసరా పించన్‌ల పంపిణీ

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ దారులు బుధవారం భారీగా తరలివచ్చారు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద వద్ధులు, వితంతువులు బీడీ కార్మికులు తమ ఆసరా పింఛన్‌ కొరకు ఉదయం 6 గంటలనుండి వరుస కట్టారు. ఆసరా పెన్షన్‌లు ప్రతి నెల మొదటి వారంలో పంచుతారు కానీ ఈ నెల పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడంతో బుధవారం మొదటి రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం 6 ...

Read More »

విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు

బీర్కూర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం రోజుల క్రితం జరిగిన విజయారెడ్డి హత్యకు మద్దతుగా సమ్మె చేసిన రెవెన్యూ ఉద్యోగులు బుధవారం నుండి విధులకు హాజరయ్యారు. దీంతో నసురుల్లాబాద్‌ తహసీల్‌ కార్యాలయం విద్యార్థులు, రైతులతో కిటకిటలాడింది. వారం రోజులుగా రెవెన్యూ సిబ్బంది కొరకు ఎదురు చూస్తున్న వారు బుధవారం ఊపిరి తీసుకున్నారు. కులం, ఆదాయం వంటి దరఖాస్తులను బుధవారం పూర్తిచేశారు. దీంతో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తమ దరఖాస్తులు తీసుకువచ్చి అధికారులకు ఇవ్వడంలో నిమగ్నమయ్యారు.

Read More »

ఏకరూప దుస్తుల పంపిణీ

బీర్కూర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం, దుర్కి గ్రామాలలో బుధవారం విద్యార్థులకు ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యశోదా మహేందర్‌ మాట్లాడుతూ మైలారం గ్రామంలో 102 మంది విద్యార్థులకు రెండు జతల బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా దుర్కి పాఠశాలలోని విద్యార్థులకు సర్పంచ్‌ దుర్గం శ్యామల, ఎంపిటిసి కుమ్మరి నారాయణ దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు మహేందర్‌, గంగారాం, ఉపసర్పంచ్‌ ఖాదీర్‌, పాఠశాల కమిటీ అధ్యక్షులు ...

Read More »

క్రీడా దుస్తుల పంపిణీ

బీర్కూర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం నెమ్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ సూర అంజయ్య క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఆయనతోపాటు గ్రామానికి చెందిన యమున సైతం పాఠశాలలోని 24 మందికి క్రీడా దుస్తులు అందించారు. ఈ సందర్బంగా హెచ్‌ఎం వెంకటరమణ మాట్లాడుతూ రిటైర్డ్‌ హెచ్‌ఎం సూర అంజయ్య విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేందర్‌, కనకాద్రి, కిషన్‌ లాల్‌, ఉమాకాంత్‌, సంజీవులు, అతిక్‌ పాల్గొన్నారు.

Read More »

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎల్లారెడ్డి విద్యార్థులు

నిజాంసాగర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎల్లారెడ్డికి చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు కామారెడ్డి గురుకులాల సమన్వయ అధికారి గుమీడేల్లి మహేందర్‌ తెలిపారు. నిజామాబాదు స్పోర్ట్స్‌ అథారిటీ మైదానంలో మంగళవారం జరిగిన హ్యాండ్‌బాల్‌ క్రీడల్లో పాల్గొన్న తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయికి అండర్‌ యు 19 వయస్సు విభాగంలో హ్యాండ్‌బాల్‌ మహేశ్‌, సాయికుమార్‌, కిరణ్‌, రణదీప్‌, రాహుల్‌, నితిన్‌ తమ పాఠశాలకు హ్యాండ్‌బాల్‌ జోనల్‌ ...

Read More »

ఓటరు వెరిఫికేషన్‌ కార్యక్రమం విజయవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ జాబితాలో తప్పులు లేకుండా స్పష్టంగా ఉండేందుకు ఓటర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ అన్నారు. ఓటర్‌ వెరిఫికేషన్‌ పోగ్రామ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ గత అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికలలో ఓటర్లు ఎంతో ఇబ్బంది పడిన నేపథ్యంలో ఓటర్‌ వెరిఫికేషన్‌లో ఓటర్‌ జాబితా స్పష్టంగా ...

Read More »

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు గీత కాన్వెంట్‌ విద్యార్థులు

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా కేశవరంలో జరిగే రాష్ట్రస్థాయి ఎస్‌జిఎఫ్‌ యు-17 ఖోఖో పోటీలకు నందిపేట మండల కండరంలోని శ్రీ గీతా హై స్కూల్‌ విద్యార్థిని పావని ఎంపికయ్యింది. పోటీలు నవంబర్‌ 14,15,16 వ తేదీలలో జరగనున్నాయి. పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్‌ కానూరి గంగాసాగర్‌, ప్రధానోపాధ్యాయులు సిహెచ్‌ గంగా భూషణ్‌లు విద్యార్థినిని అభినందించి పంపారు. ఈ సందర్భంగా కానూరి గంగా సాగర్‌ మాట్లాడుతు తమ పాఠశాల విద్యార్థులు గతంలో కూడ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని ...

Read More »

పన్నులు, రుసుముల వసూలుకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖల ద్వారా వసూలు చేయవలసిన పన్నులు, ఇతర రుసుములను రికవరీ చేయడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మాత్యులు హరీష్‌ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే. జోషితో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 11 శాఖలకు సంబంధించి రూ. 1966 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వివిధ రకాల రుసుములు, ...

Read More »