Breaking News

జనరల్‌ ఫంక్షన్‌ హాల్‌ భవనానికి భూమి పూజ

బీర్కూర్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని హాజీపూర్‌ గ్రామంలో బుధవారం రూ. 25 లక్షలతో నిర్మించనున్న జనరల్‌ ఫంక్షన్‌ హాల్‌కు జడ్పిటిసి జన్నుబాయి ప్రతాప్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జన్నుబాయి మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చలువతో గ్రామ ప్రజలకు ఫంక్షన్‌ హాల్‌ మంజూరైందన్నారు.

పోచారం శ్రీనివాస్‌రెడ్డితోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంజయ్య, ఉపసర్పంచ్‌ విఠల్‌, మాజీ జడ్పిటిసి విఠల్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *