Breaking News

నీటి వధా నిరోధించండి

నందిపేట్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి ఘోషతో ఒక పక్క ప్రజలు అల్లాడుతుంటే నందిపేట్‌ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వలన త్రాగునీటి కులాయిల నుండి నీరు వధాగా వెళుతుంది. దాంతో లక్షలు ఖర్చుపెట్టి మరమ్మతు చేస్తున్న రోడ్డు మొరం కొట్టుకుపోయి రోడ్డు అంతా బురదమయం అవుతుంది.

నిజామాబాద్‌ కు పోయే మెయిన్‌ రోడ్‌లో తిరుమల ఆటోమొబైల్‌ ప్రక్కన గల కాలనీలో కులాయి ఉదయం 11 గంటల వరకు వధాగా పారుతుంది. అదేవిధంగా చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద గల రోడ్డుపై కూడా నీరు వధాగా వెళ్తుంది. అయినప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనిని ప్రజలు వాట్సాప్‌లో వీడియో షేర్‌ చేసి తమ నిరసనలు తెలుపుతున్నారు.

Check Also

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 63వ వర్ధంతిని ఎల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *