Breaking News

రూ. 35 వేలు ఆర్థిక సహాయం

కామారెడ్డి, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయరెడ్డి తహసీల్దార్‌ దారుణ హత్య సమయంలో కాపాడబోయి మరణించిన కారు డ్రైవర్‌ గురునాథం కుటుంబానికి, గాయపడిన అటెండర్‌, రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ అండ్‌ సివిల్‌ సప్లైలోని రెవిన్యూ సిబ్బంది రూ. 35 వేలు ఆర్థిక సహాయాన్ని బుధవారం కామారెడ్డి జిల్లా సెక్రెటరీ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ శ్రీనివాస్‌కు జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు.

ఈ మొత్తానికి ఇంకా జిల్లాలోని ఇతర మండలం నుండి అందిన మొత్తాన్ని కలిపి బాధితులకు అందించడం జరుగుతుందని కామారెడ్డి రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌, శ్రీనివాసరావు, పద్మారావు, భుజంగరావు, ప్రసాద్‌, పవన్‌ సూపరింటెండెంట్లు, కలెక్టరేట్‌, పౌర సరఫరా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *