Breaking News

చదువుతోపాటు క్రీడలు అవసరం

రెంజల్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యవసరమని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ బలరాం అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అండర్‌- 15 బాల బాలికల వాలీబాల్‌ పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయని, క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి జ్ఞాపకశక్తి ఏకాగ్రత ల పెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే వారికి సరైన గుర్తింపు లభిస్తుందని బలరాం స్పష్టం చేశారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 బాలుర జట్లు, 5 బాలికల జట్లు పాల్గొనగా బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో దర్పల్లి నిలువుగా ద్వితీయ స్థానాన్ని జక్రాన్‌పల్లి జట్టు కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో నందిపేట్‌ మొదటి స్థానం కైవసం చేసుకోగా, ద్వితీయ స్థానాన్ని జక్రాన్‌పల్లి జట్టు సాధించింది.

విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలలో అత్యంత నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు పంపనున్నట్లు ప్రిన్సిపాల్‌ బలరాం తెలిపారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజేందర్‌, సాహెబ్‌, గణేష్‌, రాజేష్‌ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్‌, క ష్ణమూర్తి, ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *