Breaking News

క్రీడా దుస్తుల పంపిణీ

బీర్కూర్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం నెమ్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ సూర అంజయ్య క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఆయనతోపాటు గ్రామానికి చెందిన యమున సైతం పాఠశాలలోని 24 మందికి క్రీడా దుస్తులు అందించారు.

ఈ సందర్బంగా హెచ్‌ఎం వెంకటరమణ మాట్లాడుతూ రిటైర్డ్‌ హెచ్‌ఎం సూర అంజయ్య విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేందర్‌, కనకాద్రి, కిషన్‌ లాల్‌, ఉమాకాంత్‌, సంజీవులు, అతిక్‌ పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *