Breaking News

నోటుపుస్తకాల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో గురువారం నిజామాబాదు మండలం ధర్మారం తాండా ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులకు పండ్లు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. పేద విద్యార్థులకు లయన్స్‌ క్లబ్‌ అండగా ఉంటుందని చెప్పారు. లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి చింతల గంగాదాస్‌, కోశాధికారి సిలివేరి గణేష్‌, ప్రోగ్రామ్‌ చైర్మెన్‌ రమేష్‌, ధర్మారం తాండా సర్పంచ్‌ గంగారాం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్‌, ఉపాద్యాయులు భూషణ్‌ పాల్గొన్నారు.

Check Also

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *