Breaking News

Daily Archives: November 20, 2019

పుస్తకాలతోనే యువత భవిష్యతు

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి యువత భవిష్యత్తు పుస్తకాల పైన ఆధారపడి ఉందని, వాటి ద్వారా విజ్ఞాన సముపార్జన జరుగుతుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు తెలిపారు. ఈ నెల 14 నుండి 20 వరకు 52వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. చదువుతోపాటు సంస్కారం, పెద్దలపై గౌరవం పుస్తకాలతోనే లభిస్తుందని తెలిపారు. ...

Read More »

అత్యవసర పరిస్థితిలో 48 గంటల్లో సమాచారం పొందవచ్చు

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2005 సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని, పంచాయతి నుండి పార్లమెంట్‌ వరకు కేవలం 10 రూపాయలు చెల్లించి సమాచారాన్ని 30 రోజుల్లో పొందవచ్చునని, అత్యటసర పరిస్థితులలో 48 గంటల లోపు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు అని అఖిలాభారతీయ ప్రజా సేవా సమితి సమాచార చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం ...

Read More »

దళారులపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇసుక రవాణా చేస్తున్న దళారులపై, ఆర్‌టివో ఏజెంట్‌లపై చర్య తీసుకోవాలని కామారెడ్డి ఆర్‌టివో ఏవో రవికి వినతిపత్రం అందజేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు మరియు ప్రజలను ఆసరాగా చేసుకొని ఆర్‌టివో ఏజెంట్‌లను యథేచ్ఛగా ప్రజల దగ్గర అక్రమంగా లైసెన్సులు పేరుతొ వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని వారన్నారు. అదే విదంగా కామారెడ్డిలో కొత్తగా ఇల్లు నిర్మిచాలన్న ఇసుక దొరకక దళారుల వద్ద 15 వేల నుంచి 20 వేల వరకు ...

Read More »

ఎవరు వచ్చినా కట్టడం ఆగదు

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో భక్తహనుమాన్‌ మందిరం ప్రక్కన లేఔట్‌ లో మున్సిపల్‌కి వచ్చిన మున్సిపల్‌ లేఔట్‌ స్థలంలో కొందరు అక్రమ కట్టడం చేపట్టారు. అంతేగాకుండా మున్సిపల్‌ కమిషనర్‌ మరియు టిపివో సిబ్బంది వచ్చిన వారితో వాగ్వాదానికి దిగారు. కొందరు మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తూ ఎవరు వచ్చినా కట్టడం ఆగదని మున్సిపల్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అందరికి ఒకే న్యాయం ఉండాలని వాదిస్తూ ...

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఆల్‌ ఇండియా ప్రథమ మహాసభలు పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కామారెడ్డి జిల్లా కమిటీ నాయకులు మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు లీలా మాట్లాడుతూ దేశంలోని ఇరవై రెండు రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఓంకార్‌ భవన్‌లో ఈ నెల 29, 30 డిసెంబర్‌ 1వ తేదీల్లో జరగబోయే మహాసభలకు కామారెడ్డి జిల్లాలోని మహిళలందరూ ...

Read More »

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి కార్యవర్గ సమావేశంలో బీజేపీ అధికారప్రతినిది అల్జాపూర్‌ శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల అధ్యక్షుడి ఎంపిక జరిగింది. రెంజల్‌ గ్రామానికి చెందిన చుక్క రాజును పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. మండలంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా నాయకులు గీత రెడ్డి, ...

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల అందజేత

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలానికి మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను బుధవారం బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్‌ ఆమీర్‌ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగిందని రెంజల్‌ తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ తెలిపారు. మండలానికి 44 షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని వాటిని లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమేష్‌, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫిక్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మోగిన ఎన్నికల బెల్‌

నందిపేట్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడుల్లో మూడున్నరెళ్ల తర్వాత విద్య యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. గత కమిటీలకు 2016 జులైలో ఎన్నికలు నిర్వహించగా పదవీకాలం 2018 జులైలో ముగిసింది. తాజాగా ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని విద్యాశాఖ షెడ్యూల్‌ జారీచేశారని మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలను ప్రతిష్ట్రత్మంగా తీసుకుంటూ ...

Read More »

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

నందిపేట్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం షాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు షాపూర్‌ ఎంపిటిసి మద్దుల రాణి మురళి, గ్రామ సర్పంచ్‌ సౌజన్యతో కలిసి బుధవారం భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలోని సిసి రోడ్లు డ్రైనేజీ ల కొరకు నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల అభివద్ధి కొరకు నిధులు కేటాయించడంతో గ్రామస్తుల సహకారంతో ...

Read More »

686/4 ఆ భూమి ప్రభుత్వానిదే

నందిపేట్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని ఆర్మూర్‌ బైపాస్‌ రోడ్డు ప్రక్కన గల ప్రభుత్వ భూమిలో ప్రైవేట్‌ వ్యక్తులు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకూడదని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మండల కేంద్రంలోని బైపాస్‌ రోడ్డు ప్రక్కన గల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ మంగళవారం నందిపేట్‌ గ్రామ అభివద్ధి కమిటీ, ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ దరఖాస్తు ఇవ్వడంతో స్పందించిన రెవెన్యూ ...

Read More »

మొక్కలు నాటిన నుడా ఛైర్మన్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి విసిరిన చాలెంజ్‌ను నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ చైర్మెన్‌ ప్రభాకర్‌ రెడ్డి స్వీకరించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా ప్రభాకర్‌ రెడ్డి సుభాష్‌ నగర్‌లో బుదవారం మొక్కలు నాటారు. అనంతరం తెలంగాణ జాగతి ముంబై ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌, ట్రస్మా అధ్యక్షుడు జయసింహ గౌడ్‌, సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌ జలంధర్‌ రెడ్డి జాగతి రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ భరద్వాజలకు ప్రభాకర్‌ రెడ్డి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. ...

Read More »

సమస్యలు పరిష్కారమమ్యేంత వరకు సమ్మె

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం నిజామాబాదులో ఆర్టీసి కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 47 వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం లోని ధర్నా చౌక్‌ వద్ద బుదవారం రిలే దీక్షలలో 1,2 డిపోలకు చెందిన ఆర్టీసి కార్మికులు కూర్చున్నారు. పలువురు వామపక్ష ప్రజాసంఘాల నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె బుదవారం నాటికి 47 వ రోజుకు చేరుకుంది. సమస్యలు ...

Read More »

ఉచిత మధుమేహ శిబిరం

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.మోహన్స్‌ డయాబెటిస్‌ స్పెషాలిటీ సెంటర్‌ ఆద్వర్యంలో బుదవారం నిజామాబాదు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఉచిత మధుమేహ శిభిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా జడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విట్టల్‌ రావు షుగర్‌, బిపి పరీక్షలు చేయించున్నారు. జెడ్పి ఉద్యోగులకు డాక్టర్‌ మోహన్స్‌ డయాబెటిక్‌ సెంటర్‌ వారు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Read More »

లైసెన్సులేని వరి విత్తనాలు స్వాధీనం

ఆర్మూర్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పుర్‌ మండలం మోతే గ్రామంలో లైసెన్సు లేని విత్తనాలు విక్రయిస్తున్న చింతలపల్లి హన్మండ్లు అనే వ్యక్తిపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో మండల వ్యవసాయ అధికారి ప్రకాశ్‌ 25 బ్యాగుల వరి విత్తనాలు స్వాదీనం చేసుకొని చట్ట రీత్యా చర్యలు చేపట్టారు.

Read More »

25 న మండల సర్వసభ్య సమావేశం

నందిపేట్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 25 న నిర్వహిస్తున్నట్లు మండల అభివద్ధి అధికారి నాగవర్ధన్‌ తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగే సమావేశానికి ఉదయం 11 గంటలకు అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు. వివిధ శాఖల ప్రగతి నివేదికలు తీసుకొని అధికారులు రావాలని కోరారు. సమావేశానికి ఎంపీపీ వాకిటి సంతోష్‌ అధ్యక్షత వహిస్తారని తెలిపారు.

Read More »

పిడిఎస్‌యు సభ్యత్వ నమోదు ప్రారంభం

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌. కల్పన మాట్లాడుతూ శాస్త్రీయ విద్య లక్ష్యంగా, సమ సమాజమే ద్యేయంగా ఏర్పడ్డ పిడిఎస్‌యు గత నలభై సంవత్సరాలుగా విద్యార్థుల హక్కులకోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలో బలమైన విప్లవ విద్యార్థి సంఘంగా పిడిఎస్‌యు పనిచేస్తుందన్నారు. సంస్థను మరింత విస్తరించే క్రమంలో పిడిఎస్‌యు సభ్యత్వ నమోదు ...

Read More »