Breaking News

దళారులపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇసుక రవాణా చేస్తున్న దళారులపై, ఆర్‌టివో ఏజెంట్‌లపై చర్య తీసుకోవాలని కామారెడ్డి ఆర్‌టివో ఏవో రవికి వినతిపత్రం అందజేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు మరియు ప్రజలను ఆసరాగా చేసుకొని ఆర్‌టివో ఏజెంట్‌లను యథేచ్ఛగా ప్రజల దగ్గర అక్రమంగా లైసెన్సులు పేరుతొ వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని వారన్నారు.

అదే విదంగా కామారెడ్డిలో కొత్తగా ఇల్లు నిర్మిచాలన్న ఇసుక దొరకక దళారుల వద్ద 15 వేల నుంచి 20 వేల వరకు ఇసుక ట్రాక్టర్‌ కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంతో పేద మధ్య తరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

కావున కామారెడ్డి లో ఉన్న ఇసుక డంపింగ్‌ యార్డ్‌లపై చర్య తీసుకోవాలని ప్రభుత్వం ద్వారా ఇసుక సరఫరా చేయాలని వారు డిమాండ్‌ చేసారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎప్‌ కామారెడ్డి జిల్లా కన్వీనర్‌ ముదం ప్రవీణ్‌, కో కన్వీనర్‌ దువ్వాల నరేశ్‌ పాల్గొన్నారు.

Check Also

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ ...

Comment on the article