Breaking News

అత్యవసర పరిస్థితిలో 48 గంటల్లో సమాచారం పొందవచ్చు

కామారెడ్డి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2005 సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని, పంచాయతి నుండి పార్లమెంట్‌ వరకు కేవలం 10 రూపాయలు చెల్లించి సమాచారాన్ని 30 రోజుల్లో పొందవచ్చునని, అత్యటసర పరిస్థితులలో 48 గంటల లోపు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు అని అఖిలాభారతీయ ప్రజా సేవా సమితి సమాచార చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అన్నారు.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం కళాశాల ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంరావు మాట్లాడుతూ పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వని పక్షంలో సమాచార కమిషనర్‌ 250 నుండి 25 వేల వరకు జరిమానా విధించవచ్చు అని పేర్కొన్నారు.

కార్యక్రంమంలో ముఖ్య అతిధిగా హాజరైన దోమకొండ ఎస్‌ఐ రాజేశ్వర్‌ గౌడ్‌ మాట్లాడుతూ కోర్ట్‌ జడ్జిమెంట్‌లు, సిబిఐ, పోలిష్‌ స్టేషన్‌లో ఆయుదాలు, దేశ రక్షణ మినహా అన్నివిషయాల నుండి సమాచారం పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌ జె సుమంగల మాట్లాడుతూ ప్రజాలపాలిట పాశుపతాస్త్రం వంటిది అని తమ విద్యార్థులకు సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కలిగించినందుకు అంకం శ్యామ్‌ రావు బందానికి కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు అజామ్‌, అధ్యాపకులు జి.రాజు, ఎంఎన్‌. రాజు, ఎస్‌.శ్రీనివాస్‌, భాస్కర్‌, ఎన్‌. వెంకట్‌, శేషారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

గణతంత్ర వేడుకలు ఘనంగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర వేడుకలను ఆకట్టుకునే విధంగా ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *