Breaking News

Daily Archives: November 21, 2019

మేడారం జాతర తేదీలు ఖరారు

హైదరాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజనుల జాతర పండుగైన మేడారం జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మేడారం మహా జాతర తేదీలను జాతర పూజారుల సంఘం ప్రకటించింది. 2020 ఫిబ్రవరిలో 5వ తేదీన బుధవారం సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6వ తేదీ గురువారం సమ్మక్క గద్దెకు చేరుతుంది. ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8వ తేదీ శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుందని ...

Read More »

ఆడిట్‌ పేరాలు పెండింగ్‌ క్లియర్‌ చేయండి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఆడిట్‌ కార్యాలయంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఆడిట్‌ పేరాలను రెండు నెలల్లో క్లియర్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆడిట్‌ పేరాల పెండింగ్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చేస్తున్న పనులకు సంబంధించి జరిగిన లావాదేవీల్లో సరైన విధంగా నియమ నిబంధనలు పాటించకపోవడం ద్వారా ...

Read More »

తప్పుడు వ్యక్తుల ప్రచారాలకు మోసపోవద్దు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ప్రభాకర్‌ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా భవన నిర్మాణ కార్మికుల తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధపు ప్రచారాలతో కార్మికులను మోసగించే చర్యలకు పాల్పడుతున్న విషయం జిల్లా కమిటీ దష్టికి వచ్చిందని దీన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సంఘంలోని కార్మికులు అలాంటి తప్పుడు వ్యక్తుల యొక్క ...

Read More »

కామారెడ్డి నుంచి ‘సిమ్‌’లు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో వెలుగుచూసిన హనీట్రాప్‌ (వలపు వల) కేసులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు మూలాలు కామారెడ్డిలో ఉన్నా యని పోలీసులు గుర్తించారు. భారత ఆర్మీ అధికారులే లక్ష్యంగా పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ విసిరిన వలపు వల హైదరాబాద్‌లో బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా పొల్కంపేటకు చెందిన మహమ్మద్‌ వాహెద్‌ పాషా, మహమ్మద్‌ అహ్మద్‌ పాషా అనే సోదరులు, మెదక్‌కు ...

Read More »

ముగిసిన ఖోఖో శిక్షణ శిబిరం

నందిపేట్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ జిల్లా మేడారంలో ఈనెల 22, 23, 24 వ తేదీలలో జరగబోయే 53వ రాష్ట్రస్థాయి సీనియర్‌ ఖోఖో పోటీలకు ఎంపిక చేయబడిన నిజామాబాద్‌ జిల్లా జట్టు క్రీడాకారులకు ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఎంపిక చేసిన క్రీడాకారులకు ఈనెల 13వ తేదీ నుండి నందిపేట మండల కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్‌ హై స్కూల్‌ నందు ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తొమ్మిది రోజుల పాటు క్రీడాకారులకు ...

Read More »

ముదిరాజ్‌లకు చేపల చెరువులో సభ్యత్వం కల్పించాలి

నిజాంసాగర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ ఆవిర్భావ దినోత్సవం మరియు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం లింగంపేట మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ మహాసభ మండల కమిటీ గౌరవాధ్యక్షులు బొల్లారం సాయిలు మాట్లాడుతూ ఇప్పటివరకు ముదిరాజులకు చేపలు, చెరువులు సభ్యత్వం ప్రభుత్వం కల్పించ లేదన్నారు. ఇతర జిల్లాల్లో జీవో అమలు అయినప్పటికి కామారెడ్డి జిల్లాలో మాత్రం నామమాత్రంగా మొదలైందని ...

Read More »

హస్త కళల నైపుణ్య పోటీలకు ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థులు

నిజాంసాగర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎల్లారెడ్డికి చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ”హస్త నైపుణ్య లలిత కళల” కు ఎంపికైనట్లు కామారెడ్డి గురుకులాల సమన్వయ అధికారి గుమీడేల్లి మహేందర్‌ తెలిపారు. నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల నిజామాబాద్‌ రీజినల్‌ స్థాయిలో 15 గురుకుల పాఠశాలల నుండి బాల బాలికలు ”డ్రాయింగ్‌, పెయింటింగ్‌, పనికిరాని వస్తువులచే గహములో ఆహ్లాద కరంగా ఉండేందుకు వస్తువులు తయారు చేయుట” పోటీలలో ఎల్లారెడ్డి విద్యార్థులు పాల్గొని ప్రథమ ...

Read More »

తహసిల్‌ కార్యాలయాలు భద్రమేనా?

నందిపేట్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్‌ మేట్‌ రెవెన్యూ అధికారి హత్య నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు కార్యాలయాలను మూసివేసి వారం రోజులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లోని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధ్రువపత్రాలు రెవెన్యూ శాఖ నుంచి రాకపోవడంతో కొందరికి ఉద్యోగపరంగా, రైతులకు బ్యాంకులో రుణాల కోసం ఇబ్బందులు పడ్డారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖకు భద్రత కల్పిస్తామని హామీనివ్వడంతో గత వారం ...

Read More »

పారిశుద్య, యాంటీ లార్వా పనులు కొనసాగాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుద్ధ్య కార్యక్రమాలు, యాంటీ లార్వా పనులు కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో మున్సిపల్‌ అధికారులు, వైద్యశాఖ అధికారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిటీ శానిటేషన్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఎందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తిస్థాయి నివేదిక చేయాలని ఆదేశించారు. అదేవిధంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు విస్తరించకుండా స్వైన్‌ ఫ్ల్యూ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య ...

Read More »

సెన్సెస్‌ చార్జ్‌ ఆఫీసర్లుగా ఏసీపీలను అనుమతించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనాభా సేకరణకు చార్జి ఆఫీసర్లుగా సహాయ సిటీ ప్లానర్‌లను నియమించడానికి అనుమతించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సెన్సస్‌ సంచాలకులను కోరారు. 2021 జనాభా సేకరణకు సంబంధించి వివరాల నమోదుకు అధికారుల నియామకానికి పలు సూచనలు చేస్తూ రాష్ట్ర సెన్సస్‌ డైరెక్టర్‌ ఇలంబర్తి జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన గ్రామాలతోపాటు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల వివరాలను సంబంధిత నమూనా ఫారాలు ...

Read More »