Breaking News

Daily Archives: November 23, 2019

గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శనివారం జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ సిండే పాఠశాలను సందర్శించి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలని పాఠశాల పిన్సిపల్‌, హాస్టల్‌ వార్డన్‌లకు సూచించారు. ఘటన జరగడం దురదష్టకరమన్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలుంటే తన దష్టికి తీసుకురావాలని, తెలంగాణ రాష్టప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థిపై లక్ష పైన ఖర్చు పెడుతున్నారని గుర్తు ...

Read More »

ఘనంగా ప్రవీణ్‌కుమార్‌ జన్మదిన వేడుకలు

నిజాంసాగర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ జన్మదిన వేడుకలు (ప్రతిజ్ఞ దివస్‌) శనివారం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా టిజిపిఏ, స్వేరోస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శారదాబాయి వద్ధుల ఆశ్రమంలో సీనియర్‌ సిటిజన్‌ల మధ్య జరిపారు. ఆశ్రమంలోని వద్దులకు పండ్లు, బ్రేడ్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం తాడ్వాయి, లింగంపేట్‌ బాలికల గురుకుల కళాశాలల్లో మొక్కలు నాటారు. స్వేరోస్‌ 10 కమండ్మెంట్స్‌ గురించి వివరించారు. ...

Read More »

ఫ్లైఓవర్‌ వంతెన పైనుంచి మహిళపై పడిన కారు!

హైదరాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ వంతెనపై మరో విషాదం చోటుచేసుకుంది. వంతెనపై వేగంగా వెళ్తున్న కారు శనివారం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మతిచెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే శనివారం మధ్యాహ్నం ఫ్లైఓవర్‌ మీదుగా ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి పల్టీ కొట్టింది. వంతెన పైనుంచి ...

Read More »

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు జాప్యం లేకుండా పూర్తిచేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఎల్లమ్మ గుట్ట వద్ద గల రైల్వే అండర్‌ బ్రిడ్జి మొత్తం పనులను మూడు నెలల్లో పూర్తి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో శనివారం పోలీస్‌ ఆర్‌అండ్‌బి, నగరపాలక సంస్థ, రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి పనులు గత సంవత్సరం నవంబర్‌ నెల చివరి వరకు పూర్తి పూర్తిచేయాలని ఒప్పందం చేసినట్లు ఉందని, ...

Read More »

సులభ పద్దతుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ద్వారా చేపట్టిన వివిధ పనులను వివాదాలు సంభవించినప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమస్యలు తొందరగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్నేట్‌ డిస్ప్యూట్‌ రీ సొల్యూషన్‌ (ఐ సిఏడిఆర్‌) ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మిషన్‌ భగీరథ ఇంజనీర్లకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులపై జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో రెండు రోజులపాటు జరిగే వర్క్‌ షాపును జిల్లా కలెక్టర్‌ ...

Read More »

జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శనివారం ప్రభుత్వ ప్రధాన జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ వార్డులలో సిబ్బంది వైద్యాధికారుల హాజరును, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పలు వార్డులకు వెళ్లి అక్కడికక్కడే తగు సూచనలు సంబంధించిన ఆదేశాలు వైద్యాధికారులకు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి ...

Read More »

భూ హద్దులు చెరిపేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని నాగల్‌ గావ్‌ గ్రామంలో శోభన్‌ రావు తానాజీ అతని భూమి పక్కనగల సూర్య వంశీ బాబు యొక్క భూమి హద్దులు చెరిపి వేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంసిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జబ్బర్‌ నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు. వారి వల్ల సూర్య వంశి బాబుకు ప్రాణభయం నెలకొందని, ఈ విషయంలో న్యాయం చేయమని గత నాలుగు ...

Read More »

అభివద్ధిపథంలో డొంకేశ్వర్‌ గ్రామం

నందిపేట్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాం సాగర్‌ నిర్మాణ సమయంలో గ్రామం పూర్తిగా ముంపునకు గురై ఇండ్లు, పంట పొలాలు వదులుకొని పాత ఊరిలోని ఆస్తులన్నీ వదులుకొని నిరాశ్రయులుగా నూతన ప్రాంతానికి వచ్చారు. ఊరిలో ఉపాధి కరవై జీవన వ్యవస్థ అస్తవ్యస్తమైంది, అయినా వారు ఏమాత్రం ఆత్మస్తైర్యాన్ని కోల్పోకుండా కష్టాన్ని నమ్ముకొని గ్రామ పునర్నిర్మాణానికి అడుగులు వేశారు. కొందరు పొట్ట కూటి కోసం గల్ఫ్‌ బాట పట్టి డబ్బులు పంపితే ఇంకొందరు ఇక్కడే వ్యవసాయంపై ఆధారపడి చుట్టుపక్కల పల్లెల ...

Read More »