Breaking News

ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

కామారెడ్డి, నవంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే పోరాటానికి సిద్ధమవుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లాలోని రామరెడ్డి మండలంలో సీపీఐ పార్టీ 2వ మహాసభలు నిర్వహించారు. సభకు అధ్యక్షతగా సీపీఐ రామరెడ్డి మండల అధ్యక్షత కసిం వ్యవహరించారు.

ఈ సందర్భంగా పశ్యపద్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. అంతే కాకుండా మోడీ ప్రభుత్వం కార్పోరేట్‌ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తుందని, జిఎస్‌టి వల్ల అనేక మంది సామాన్య ప్రజలు పన్నులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా మోడీ ప్రభుత్వం నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులని మోసం చేశారని పద్మ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేర్చలేదని అన్నారు. రైతులకు సకాలంలో రుణ మాఫీ అని చెప్పి రైతులను మోసం చేయడం ఎంత వరకు సమంజసమని పద్మ ప్రశ్నించారు. అదేవిదంగా అకాల వర్షాలకు నష్టపోయిన పంటకు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. అంతే కాకుండా కేసిఆర్‌ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఉన్న ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసారని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు పడక గదుల ఇళ్ళ పేరుతో ప్రజలకు ఆశ చూపి ఏ ఒక్కరికి కూడా ఇంకా ఇవ్వలేరని, అంతే కాకుండా దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పి ఎవరికి ఇవ్వలేదని కెసిఆర్‌ మాటలు కేవలం గారడి మాటలు అని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. అదే విదంగా ఆర్‌టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పూర్తిగా ప్రైవేట్‌ పరంచేసి కమిషన్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు.

కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దుబ్బాస్‌ రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.దశరథ్‌, కసింను మండల కన్వీనర్‌, శ్యామల మహిళ కన్వీనర్‌, శ్యామల రైతుసంగం, రాములు ప్రచార కర్తగా, లింగం, లింబాద్రి, భూమన్నా, రేణుక 9 మందితో కమిటీ ఏర్పాటు చేశారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *