Breaking News

Daily Archives: November 30, 2019

సమాచారహక్కు చట్టంపై అవగాహన

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌రావు హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం 2005 ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు. గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ...

Read More »

అవినీతికి ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిర్యాదులకు తావు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా రెవెన్యూ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. ఈ మధ్యనే తహసీల్దార్లు డిప్యూటీ తాసిల్దారు జరిగిన బదిలీల నేపథ్యంలో శనివారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా పలు విషయాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి సందర్భంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి అధికంగా వ్యాధులు వస్తున్నాయని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ...

Read More »

హసన్‌పల్లి ఎస్‌యంసి చైర్మన్‌గా బోయని సాయిలు

నిజాంసాగర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌ పల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ఎస్‌ఎంసి కమిటీ ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్‌ బోయిని ఎర్ర సాయిలు ఎన్నిక కాగా వైస్‌ చైర్మన్‌గా బేగారి సావిత్రి ఎన్నికయ్యారని పాఠశాల ప్రధానోపాద్యాయులు భూమయ్య తెలిపారు. ఎయంసి చైర్మన్‌ సాయిలు, వైస్‌ చైర్మన్‌ బెంగరి సావిత్రిలకు ఎన్నిక కావడంతో ప్రధానోపాద్యాయులు భూమయ్య, శ్రీధర్‌, టీచర్‌ సంధ్యరాణిలు కలిసి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు క్యాస గుండయ్య, బోయని ...

Read More »

ఉచిత ఆరోగ్య శిబిరం

ఆర్మూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో శనివారం ఆంద్రా బ్యాంక్‌ 97 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా యశోద ఆసుపత్రి ఆద్యర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సత్యనారాయణ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ మేనేజర్‌ రాజేష్‌ ఖన్నా, నవీన్‌, సిబ్బంది, పట్టణ న్యాయవాది చిలుక కిష్టయ్య, మెంబర్లు పాల్గొన్నారు.

Read More »

టీచింగ్‌ లర్నింగ్‌ మెటీరియల్‌పై అవగాహన

ఆర్మూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మండల పరిషత్‌ ప్రైమరీ పాఠశాలలో శనివారం టిఎల్‌ఎం టీచింగ్‌ లర్నింగ్‌ మెటీరియల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి తాను స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్తువులను విధ్యార్ధులచే చెప్పిస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా విద్యార్థులు మరింత ఉన్నతమైన ఆలోచనలు కలిగి చదువుల్లో ముందు స్థాయిలో ఉండటానికి దోహదపడతాయని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, భాగ్యలక్ష్మి, సంధ్యారాణి, రాజేంద్రప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఆర్‌టిసిది సమరశీలత కనబరిచిన పోరాటం

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మె పోరాటంలో పాల్గొన్న 48 వేలమంది ఆర్టీసీ కార్మికులకు బహుజన లెఫ్ట్‌ పార్టీ సామాజిక విప్లవ జేజేలు పలుకుతుందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దండి వెంకట్‌ తెలిపారు. శనివారం నిజామాబాదులో ఆయన మీడియాకు ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో భారతదేశంలో జరిగిన కార్మిక పోరాటాల్లో అత్యంత సమరశీలత కనబరిచిన పోరాటం ఆర్టీసిది తప్ప మరొకటి లేదనే చెప్పాలని అభిప్రాయపడ్డారు.

Read More »

ఉచిత దంత వైద్య శిబిరం

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భవాని ఆద్వర్యంలో శనివారం పెంటకలాన్‌ గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అబ్దుల్‌ రజాక్‌ 112 మందిని పరీక్షించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. గ్రామసర్పంచ్‌ రమణ, లయన్స్‌ ప్రతినిధులు గోవిందరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కొప్పాక శ్రీనివాస్‌ రావు, సూరాబత్తుని శ్రీనివాస్‌ రావు, శ్యామ్‌ సుందర్‌ పాల్గొన్నారు.

Read More »

అసంఘటిత కార్మికులు పెన్షన్‌ పథకానికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసంఘటిత కార్మికులు కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్‌ మరియు జాతీయ పెన్షన్‌ పథకం యొక్క అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల లాగా కార్మికులకు టెన్షన్‌ ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్మికులకు పెన్షన్‌ పథకాన్ని అమలు ...

Read More »

నందిపేట మండలంలో ఎస్‌ఎంసి ఎన్నికలు

నందిపేట్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని 59 పాఠశాలలకు గాను 58 పాఠశాలలో ఎస్‌ఎంసి ఎన్నికలు నిర్వహించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకున్నారని నందిపేట్‌ మండల విద్యాశాఖాధికారి పి.శ్రీనివాస్‌ రెడ్డి తెలియజేశారు. మండలంలోని మోడల్‌ పాఠశాలలో కోరం లేని కారణంగా ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. తరువాత ఎన్నిక తేదీని త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. ఎన్నికైన చైర్మన్‌లు మల్లారం పాఠశాలలో జరిగిన ఎస్‌ఎంసి ఎలక్షన్లో ఎస్‌ఎంసి చైర్మన్‌గా ఎస్‌.కె.ఖలీల్‌, వైస్‌ చైర్మన్‌ సంధ్యారాణి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ...

Read More »

రాష్ట్ర గ్రామ పంచాయతీ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా

ఆర్మూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర గ్రామ పంచాయతీ కమిషనర్‌ కార్యాలయం హైదరాబాద్‌ వద్ద పంచాయతీ కార్మికులు తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం 51 జీవో ప్రకారం 8500 రూపాయలు వేతనం అక్టోబర్‌ నెల 14 తేదీ నుండి వెంటనే అమలు చేయాలని యూనియన్‌ రాష్ట్రనాయకులు దాసు, అరుణ్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి సూర్యం అధికారులను కోరారు. మల్టీపర్పస్‌ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి ...

Read More »

నూతన టాయిలెట్లు ప్రారంభం

ఆర్మూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన 18 టాయిలెట్లను శనివారం మున్సిపల్‌ కమీషనరు శైలజ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలికల పాఠశాల అభివద్దికి కషి చేస్తున్న తల్లిదండ్రుల కమిటీ సభ్యులను అభినంధించారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. అనంతరం మున్సిపల్‌ కమీషనరు శైలజను శాలువా, పూలమాలతో ...

Read More »

మహిళలను గౌరవించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ సంస్థ మహిళలను గౌరవించాలని ముద్రించిన కరపత్రాలను కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్య సాయి హై స్కూల్‌లో శనివారం జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో స్థానిక ఎస్‌ఐ ఆసిఫ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ సమన్వయకర్త శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల పాత్ర ఏమిటనే విషయాన్ని వివరించారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ జిల్లా సమన్వయకర్త తక్కూరి ...

Read More »

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

హైదరాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. మార్చి 4 నుంచి మార్చి 21 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు పేర్కొంది. మార్చి 5 నుంచి మార్చి 23 వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు, జనవరి 28న నైతిక, విలువల పరీక్ష, జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష జరపనున్నట్లు వివరించింది.

Read More »